రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలు : కేసీఆర్

HEALTHగ్రామం యూనిట్ గా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా రోగ నిర్థారణ పరీక్షలు చేయించాలని నిర్ణయించింది ప్రభుత్వం. బోదకాలు బాధితులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయింది. బోదకాలు బాధితుల కోసం వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు సీఎం. ప్రగతి భవన్ లో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో… కేసీఆర్ కిట్లను ప్రైవేటు హాస్పిటళ్లలో అమలు చేసే ఆలోచన లేదని చెప్పారు కేసీఆర్. రైతులకు ఇచ్చే కొత్త పాస్ పుస్తకాలపై సీఎం ఫొటో ఉండాల్సిన అవసరం లేదని ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖపై శుక్రవారం (ఫిబ్రవరి-9) ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. బోదకాలు బాధితులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులు ఉన్నారని అంచనా వేశారు. వీరి కోసం వచ్చే బడ్జెట్లో నిధులిచ్చి పెన్షన్ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో బోదకాలు బాధితుల సమగ్ర సర్వే నిర్వహించి, వారి వివరాలు తీసుకోవాలని సిఎం చెప్పారు.

గ్రామం యూనిట్ గా రాష్ట్రంలో అందరికీ ఉచితంగా రోగ నిర్థారణ పరీక్షలు చేయించాలని సీఎం నిర్ణయించారు. ముందస్తు పరీక్షలు చేయడంతో పాటు వివిధ రకాల రోగాలు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆశ వర్కర్లు, ఎఎన్ఎంల జీతాలు మరోసారి పెంచుతామన్నారు. ఆశా వర్కర్లను విలేజ్ హెల్త్ అసిస్టెంటుగా గుర్తిస్తామని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కేసీఆర్ కిట్ పథకం అమలు చేయాలన్న వినతులు వస్తున్నాయని… అయితే అలాంటి ఆలోచన లేదన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలోనే అవసరమైన సౌకర్యాలు, సిబ్బందిని పెంచుతామని చెప్పారు.

వ్యవసాయశాఖ అధికారులతోనూ రివ్యూ చేసిన సీఎం… కొత్త పాస్ పుస్తకాలను ఫైనల్ చేశారు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పాస్ పుస్తకాన్ని ఎంపిక చేశారు. వీటిపై తన ఫోటో వేయద్దని అధికారులకు చెప్పారు. రైతు ఫోటో, తెలంగాణ ప్రభుత్వం ముద్ర మాత్రమే ఉండాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates