రాష్ట్ర మాతగా ఆవు : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం

ధర్మశాల : రాష్ట్ర మాతగా ఆవును ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆవును రాష్ట్రమాతగా ప్రకటిస్తూ తీర్మానించారు బీజేపీ ఎమ్మెల్యేలు. పాలు ఇవ్వడం ఆగగానే ఆవులను వధించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు శాసనసభ్యులు కోరారు. సిర్మావూరు జిల్లాలో రూ.1.52 కోట్లతో ఆవుల కోసం ప్రత్యేకంగా అభయారణ్యాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు పశుసంవర్ధక శాఖ మంత్రి వీరేందర్ కన్వర్. సోలన్, కాంగ్రా జిల్లాల్లోనూ ఆవుల అభయారణ్యాలు ఏర్పాటు చేస్తామన్నారు ఆయన. గౌరి పేరిట లోకల్ ఆవుల బ్రీడ్ ను ప్రోత్సహించాలని సూచించారు ఎమ్మెల్యేలు.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తో పాటు రాజస్థాన్ రాష్ట్రం కూడా ఆవుల పరిరక్షణకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. ఆవు సెస్ పేరిట రూ.8 కోట్లను వసూలు చేసిందని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే కిషోరిలాల్. గోవుల పరిరక్షణకు రూ.17 కోట్లు వెచ్చించామన్నారాయన.

Posted in Uncategorized

Latest Updates