రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

telangana
ఆగస్ట్ 15 నుంచి రైతులకు బీమా పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. నాలుగేళ్లలో తెలంగాణను అభివృద్దిలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. సిరిసిల్లలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. అటు సిద్దిపేట డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని అమరుల కుటుంబాలను సన్మానించారు.  అమరవీరుల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్ పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిజామాబాద్ లో వేడుకలను ప్రారంభించారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

రైతుబంధు కేవలం ఎన్నికల పెట్టుబడి పథకమని విమర్శించారు ప్రతిపక్ష పార్టీల నేతలు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరవీరుల ఆశయ సాధనకోసం కృషిచేస్తామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా అమర వీరులకు నివాళులు అర్పించారు.

ఖమ్మంలో జోరువానలోనే ఆవిర్బావ వేడుకలు జరిగాయి. భారీ వర్షంలోనే కవాతు చేశారు పోలీసులు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates