రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం..నీట మునిగిన పంటపొలాలు

rain
హైదరాబాద్ లో తెల్లవారుజామున భారీ వర్షం పడింది. ఉదయం 4 గంటలకు మొదలైన వర్షం…ఉరుములు, మెరుపులతో బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, లక్డీకపూల్, అమీర్ పేట్, ఉప్పల్, ఎల్బీనగర్ ఏరియాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వచ్చి చేరాయి. మరోవైపు జిల్లాల్లోనూ గాలి వాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్, జమ్మికుంట, హుజురాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి, మామిడి పంటలకు భారీగా నష్టం జరిగింది. శనివారం(ఏప్రిల్-7) సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం కురిసింది.

ఈదురుగాలులకు ధాన్యం నేలరాలగా, మామిడి తోటలు, మక్క పంటకు తీవ్ర నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం పడింది. కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ద్రోణి ప్రభావం మరో రెండు రోజులు కొనసాగుతుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ద్రోణి బలహీన పడిన తర్వాతే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

రాష్ట్రంలో వారం రోజులుగా రాష్ట్రంలో డిఫెరెంట్ వెదర్ కొనసాగుతోంది. ఉదయం అంతా ఎండ…సాయంత్రానికి ఈదురుగాలులతో వడగండ్ల వాన పడుతోంది. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో వాతావరణం ఇలానే కొనసాగుతోంది. దీంతో చేతికొచ్చిన పంట నేలపాలవుతోంది. క్యుములో నింబస్ మేఘాలతో పాటు రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates