రాష్ట్ర హోం మంత్రిగా మహముద్ అలీ

గురువారం తెలంగాణ సీఎం గా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు.. మహముద్ అలీ మాత్రమే ప్రమాణం చేశారు. దీంతో హోంశాఖ ను మహముద్ అలీకి సీఎం కేసీఆర్ కేటాయించారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మహముద్ అలీకి ఇప్పుడు  హోం శాఖ దక్కింది. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్, మహముద్ అలీ కుటుంబ సభ్యులు ఫొటో దిగారు.

రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు టీఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

 

 

Posted in Uncategorized

Latest Updates