రాష్ర్టంలో కళాకారుల భర్తీకి నోటిఫికేషన్..

రాష్ర్టంలో కళాకారుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. హైకోర్టు గడువు ముగుస్తుండటంతో శనివారం(అక్టోబర్ 6) ఈ నిర్ణయం తీసుకుంది. కళల ద్వారా ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన 550 మంది కళాకారులకు గతంలో సర్కార్ ఉద్యోగాలు ఇచ్చింది. వీరితో రాష్ర్ట పథకాల పై గ్రామాల్లో ప్రచారం చేయిస్తోంది.  2015లో రసమయి బాలకిషన్ ను సాంస్కృతిక సారథి ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.

అయితే నిజమైన కళాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదంటూ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు నియామకాలు పారదర్శకంగా జరగలేదంది. అక్టోబర్ 7లోగా స్పెషల్ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని సర్కారుకు సూచించింది. ఇవాళ్టి(ఆదివారం)తో కోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండగా కళాకారుల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నట్లు సర్కారు ప్రకటించింది.

Posted in Uncategorized

Latest Updates