రాహుల్ కు మోడీ కౌంటర్ : ఓటింగ్ కంటే ముందే.. లే.. లే అంటున్నారు

NDA ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో శుక్రవారం(జులై-20) ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో అవిశ్వాసమనేది ఓ భాగమన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చాలామందికి ఉత్సాహంగా ఉందన్నారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీతో ఏర్పాటు చేసిన సర్కార్ తమదని మోడీ తెలిపారు సభలో రాహుల్ తనను హగ్ చేసుకోవడాన్ని ఉద్దేశించి.. ఓటింగ్ పూర్తికాకముందే తన సీట్లో కూర్చోవాలని చాలా మందికి ఉత్సాహంగా ఉందని మోడీ అనడంతో సభలో నవ్వులు పూశాయి. తన సీట్లో కూర్చోవాలని అంత ఉత్సాహం ఎందుకని మోడీ అన్నారు.

నాలుగేళ్లలో జరిగిన అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇది ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష కాదన్నారు. విపక్షాల ప్రయాణం ఎలా సాధ్యమని మోడీ ప్రశ్నించారు. కనీసం మీతో వచ్చే మిత్రులను నమ్మించండి అంటూ కాంగ్రెస్ కు చురకలంటించారు. 125 కోట్లమంది ప్రజల ఆశీర్వాదంతో తాము ఈ సీట్లో కూర్చున్నామన్నారు. 2019లో తమను అధికారంలోకి రానివ్వమని చెప్తున్నారని, జనాలను నమ్మకుండా వారికి వారే భాగ్యవిధాతలనుకుంటున్నారన్నారు. దేశ ప్రజలపై నమ్మకం, విశ్వాసం చూపండని విపక్షాలనుద్దేశించి మోడీ అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తమ లక్ష్యమని మోడీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates