రాహుల్ కు లేఖ : కాంగ్రెస్ కు దానం నాగేందర్ రాజీనామా

danamసీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. లేఖను జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు పంపించారు. పార్టీ నుంచి వెళ్లిపోవటానికి కారణాలను అందులో వివరించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ ను నియమించటంతో మనస్తాపం చెందినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన దానం.. భవిష్యత్ కార్యాచరణను శనివారం మీడియా ఎదుట ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఆయన అడుగులు అధికార టీఆర్ఎస్ పార్టీవైపు ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు కూడా చేపట్టారు దానం నాగేందర్. వైఎస్ హయాంలో మంత్రిగా, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చక్రం తిప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటీముట్టనట్లు ఉంటున్నారు దానం. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారనే ప్రచారం జరిగింది. ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని ఆశించారు. అయితే అలాంటిది ఏమీ జరగలేదు. పార్టీలో తగిన గుర్తింపు లేదనే ఆగ్రహంతో ఉన్నారు దానం.

Posted in Uncategorized

Latest Updates