రాహుల్ గాంధీ “పకోడీ” బ్రేక్

Rahul_ Pakoda12కర్ణాటకలో మరి కొన్ని నెలల్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే “జన ఆశీర్వాద యాత్ర” పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ రోజు యాత్రలో భాగంగా రాయచూరులో రాహుల్ పర్యటించారు. రాహుల్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, PCC అధ్యక్షుడు పరమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ రోజు యాత్ర జరుగుతున్న సమయంలో రాయచూరు దగ్గర్లోని కమళా గ్రామంలోని ఓ టీ షాపు దగ్గర రాహుల్ టీ బ్రేక్ తీసుకున్నారు. షాపులోని మిర్చీ పకోడీ, ఉగ్గాని, బజ్జీలను షాపు యజమాని మారెమ్మ అందించగా రాహుల్, ఇతర కాంగ్రెస్ నాయకులు వాటిని లొట్టలేసుకుంటూ తిన్నారు. అంతకుముందు రాహుల్, సిద్దరామయ్య రాయచూరులోని దర్గాను సందర్శించారు.

Posted in Uncategorized

Latest Updates