రాహుల్ డ్రగ్ అడిక్ట్ : సుబ్రహ్మణ్యస్వామి

swamyకాంగ్రెస్ పార్టీ జాతీయ అద్యక్షుడు రాహుల్ గాంధీ పై బీజేపీ MP సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందంటూ ఆరోపించారు. డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే ఈ విషయం బైటపడుతుందన్నారు. ఆయన ముఖ్యంగా కొకైన్ అనే మాధకద్రవ్యాన్ని తీసుకుంటారంటారన్నారు సుబ్రహ్మణ్యస్వామి.

పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు ప్రతి ఏడాది డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై స్పందించిన స్వామి … పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందు రాహుల్ గాంధీకి డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ కూడా పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై  స్పందించారు. పంజాబ్ లో డ్రగ్స్ తీసుకునే వారిలో ఎక్కువగా కాంగ్రెస్ నాయకులున్నారని.. ముందు  ఆ పార్టీలోని వారికి డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. అంతేకాదు ఈ డోపింగ్ టెస్ట్ రాహుల్ నుండి ప్రారంభిస్తే మంచిదంటూ సెటైర్లు వేశారు.

గతంలోను రాహుల్ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఒక హోమో సెక్సువల్ అంటూ ఆరోపించారు. ఆయనకు డ్రగ్స్  అలవాటుందని గతంలోనే విమర్శలు చేశారు స్వామి.

Posted in Uncategorized

Latest Updates