రాహుల్ ద్రవిడ్ కు అరుదైన గౌరవం

rahulమాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ద్రావిడ్ కు చోటు దక్కింది. టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన 4వ క్రికెటర్ గా రాహుల్ కు గుర్తింపు ఉంది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న అయిదో క్రికెటర్ గా ద్రావిడ్ నిలిచాడు. హాల్ ఆఫ్ ఫేమ్ లో రాహుల్ కు చోటు దక్కినట్లు ఐసీసీ తన ట్విట్టర్ లో ప్రకటించింది. భారతీయ క్రికెట్ లో వాల్ గా కీర్తిగాంచిన ద్రావిడ్.. ప్రస్తుతం అండర్-19 టీమ్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ద్రావిడ్ తన కెరీర్ లో మొత్తం 164 టెస్టులు, 344 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో అతను 13వేల 288, వన్డేల్లో 10 వేల 889 రన్స్ చేశాడు.

Posted in Uncategorized

Latest Updates