రాహుల్ పోరాటం వృధా : ఉత్కంఠ పోరులో పంజాబ్ పై ముంబై విక్టరీ

iplముంబై బతికిపోయింది. ప్లే ఆఫ్ రేసులో మరో ముందడుగు వేసింది. బుధవారం (మార్చి-16) ముంబైలోని వాంఖడే స్టేడియంలో  సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగిన మ్యాచ్ లో పంజాబ్ పై 3 పరుగుల తేడాతో గెలిచింది రోహిత్ సేన. లోకేష్ రాహుల్ చివరిదాకా పోరాడినా ప్రయోజనం లేకపోయింది. ఈ మ్యాచ్ లో ఓడి పంజాబ్ ప్లే ఆఫ్ రేసును మరింత సంక్లిష్టం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై… 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 రన్స్ చేసింది.

187 రన్స్ భారీ స్కోరును ఛేజ్ చేసేందుకు బరిలో దిగిన పంజాబ్… 3 పరుగుల తేడాతో ఓడింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ 60 బంతుల్లో 94 పరుగులు చేసి గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్ లో గెలుపుతో ముంబై 6 విజయాలతో నాలుగో స్థానానికి చేరింది. పంజాబ్ ఆరోస్థానానికి పడిపోయింది. హైదరాబాద్, చెన్నై ఇప్పటికే ప్లే ఆఫ్ చేరగా.. ఢిల్లీ ఔటైంది. మిగిలిన రెండు స్థానాల కోసం ఐదు టీంలు పోటీపడుతున్నాయి. మరో ఆరు మ్యాచులు మిగిలున్నాయి. ప్రతీ మ్యాచు కీలకంగా మారింది.

Posted in Uncategorized

Latest Updates