రాహుల్ రచ్చ : నమో యాప్ ద్వారా డేటా లీక్

rahulప్రధాని నరేంద్ర మోడీ నమో యాప్‌ నుంచి.. యూజర్ల ఆడియో, వీడియో, ఫ్రెండ్స్ వివరాలు, ఫ్యామిలీ, GPS ద్వారా వాళ్లు ఉండే లొకేషన్ ను ట్రాక్ చేయబడుతుందని రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. ఇక్కడ ఓ బిగ్ ఉన్నారని.. అతను భారతీయులపై గూఢచర్యం చేయడానికి ఇష్టపడుతున్నారని ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అతనికి మన పిల్లల డేటా కావాలి, బలవంతంగా 13లక్షల మంది NCC క్యాడెట్ లు ఈ యూప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు.

ప్రధాని మంత్రి పదవిని దుర్వినియోగం చేస్తున్నారని, భారతీయుల పర్సనల్ డేటాను నమో యాప్ ద్వారా మోడీ సేకరిస్తున్నారన్నారు. ఈ డేటా భారతీయులదని, మోడీది కాదని రాహుల్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.  రాహుల్ ట్వీట్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో నమో యాప్‌ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన యూజర్ల డేటాను థర్డ్ పార్టీకి అందజేసిందని బీజేపీ ఆరోపించింది.

Posted in Uncategorized

Latest Updates