రాహుల్ షాక్ : సరదాగా విసిరితే.. అభిమానంగా మెడలో పడింది

Rahul-Gandhiఏదో సరదాగా.. అభిమానంగా దండ విసిరితే అది సరిగ్గా వెళ్లి ఆయన మెడలో పడితే.. ఆ ఆనందంగానికి అవధులు ఉండవు. అందులోనూ మనం ఎప్పుడూ దగ్గర నుంచి కూడా చూడలేని.. స్వయంగా వెళ్లి కలుసుకోలేని వ్యక్తి విషయంలోనే అలా జరిగితే ఇంకేముందీ.. అది విచిత్రమే. ఇలాంటి అనుభవమే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిమానికి ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్నాటక ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తుముకూరులో టౌన్ లో కారు ఓపెన్ టాప్ ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అత్యంత భద్రత మధ్య ఉండే రాహుల్ చుట్టూ సెక్యూరిటీ టైట్ గా ఉంది. దీంతో సామాన్యులు ఆయన దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఓ కాంగ్రెస్ కార్యకర్త.. తన చేతిలోని పూల దండను రాహుల్ వైపు విసిరారు. అది సరిగ్గా వెళ్లి రాహుల్ మెడలో పడింది. ముందూ వెనకా ఎవరూ లేరు.. అలాంటిది మెడలో దండ పడే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు గాంధీ. వెంటనే మెడలోని దండను తీసి సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చాడు. ముఖంలో ఆందోళన వ్యక్తం చేయకుండా దండ వచ్చిన వైపు తిరిగి అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. అభిమాని దండ విసరటం, అది వెళ్లి రాహుల్ మెడలో పడటం అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కొందరు నెటిజన్లు అయితే దండలు విసిరేస్తూ.. ఇలాగే ట్రై చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates