రాహుల్ సెటైర్ పై ప్రధాని నవ్వులు : నా కళ్లల్లోకి చూసే ధైర్యం మోడీకి లేదు

గల్లా జయదేవ్ ప్రసంగంలో బాధ కనిపించిందన్నారు రాహుల్ గాంధీ. 21వ శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఏపీ బాధిత రాష్ట్రం ఏపీ అన్నారు రాహుల్ గాంధీ. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్రంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు, చురకలతో విరుచుకుపడ్డారు రాహుల్. అబద్దపు రాజకీయాలకు రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు దేశంలో బాధితులయ్యారన్నారు. మోడీ పచ్చి అబద్దాలు అడారని.. అబద్దం -1 ప్రతి వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో రూ.15 లక్షలు. అబద్దం-2 రెండు కోట్ల యువతులకు ఉద్యోగాలు అంటూ సెటైర్లు వేశారు. ఈ నాలుగేళ్లలో 4 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు రాహుల్. భారతీయ యువతి మోడీపై నమ్మకం పెట్టుకుందన్నారు. పార్లమెంట్ లో ప్రధాని మాటకు విలువ ఉండాలి కానీ.. మాట మార్చకూడదన్నారు. బ్లాక్ మనీ పేరుతో నోట్ల రద్దు చేసి, జనాన్ని గందరగోళానికి గురి చేశారన్నారు. ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమన్నారని అంటూ వెకరాకాలు ఆడారని అన్నారు. పెట్రోల్, డీజిల్ GST పరిధిలోని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన GSTని మోడీ వ్యతిరేకించారు.. ఇప్పుడు ఐదు రకాల శ్లాబులతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఉపాధి కల్పనా వ్యవస్థనే దెబ్బ తీశారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

దేశానికి సేవకుడిగా ఉంటానన్న మోడీ.. మొత్తం దేశాన్ని మోసం చేశారన్నారు. ప్రధాని మోడీ గారడి మాటలకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. 10 మంది కుబేరుల కోసం మోడీ పని చేస్తున్నారన్నారు. మోడీ ఫ్రాన్స్ ఎవరితో వెళ్లారు.. ఎందుకు వెళ్లారని నిలదీశారు. రాఫెల్ విమానాల కుంభకోణంపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్కో విమానం 450 కోట్లకు డీల్ జరిగితే.. మోడీ వచ్చిన తర్వాత ఒక్కో విమానం రూ.1,600 కోట్ల ఒప్పందం జరిగిందన్నారు. ఓ వ్యాపారికి మోడీ 45 వేల కోట్లు లబ్ది చేకూర్చారని ఆరోపించారు. ప్రధాని నవ్వుతూ కనిపించినా లోపల అసహనం ఉందని చురకలు అంటించారు. వేలమంది చైనా సైనికులు భారత్ లో చొరబడ్డారు.. మోడీ మాత్రం సైనికులనే అవమానించారు. రైతులకు మేలు చేసేందుకు మోడీకి ధైర్యం, శక్తి లేవన్నారు. ప్రధాని మోడీ సూటిగా నా కళ్లలోకి చూడలేకపోతున్నారంటూ కామెంట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates