రా, ఐబీ చీఫ్ ల పదవీకాలం పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

ఇంటెలిజెన్స్‌ బ్యూరో, భారత గూఢచర్య సంస్థ ల చీఫ్ ల   పదవీ కాలాన్ని ఆరు నెలలకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2019 వ సంవత్సరంలో రానున్న ఎన్నికల దృష్ట్యా  ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ  వీరిద్దరి పదవీకాలాన్ని శుక్రవారం పొడిగించింది. వాస్తవానికి ఐబీ డైరెక్టర్ రాజీవ్ జైన్ పదవీకాలం ఈ డిసెంబర్ 30న, ‘రా’ కార్యదర్శి అనిల్ కె ధస్మానా పదవీకాలం ఈ డిసెంబర్ 29న ముగియనుంది.

ఝార్ఖండ్‌కు చెందిన రాజీవ్ జైన్‌ 1980 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన 2016 డిసెంబరు 30న ఐబీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ డిసెంబర్ 30తో ఆయన రెండేళ్ల పదవీకాలం ముగియనుంది. ధస్మానా మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన అధికారి. ఈయన 1981 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. 2016 సెంబరు 29న ‘రా’ కార్యదర్శిగా నియమితులయ్యారు.

Posted in Uncategorized

Latest Updates