రికవరీలో తక్కువ చూపించినందుకు…అడ్డంగా దొరికిన ఖాకీలు

money-policeరికవరీ చేసిన మొత్తం కన్న తక్కువగా చూపించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకున్నారు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాచకొండ సీపీ.

వారం రోజుల క్రితం మేడిపల్లిలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న కొంతమందిని అరెస్టు చేశారు మల్కాజిగిరి పోలీసులు. వారి నుంచి 1,30,000 నగదును స్వాధీనం చేసుకొని 80వేల నగదును రికవరీ కింద చూపించారు. రికవరీలో 50వేలు తక్కువ చూపించినట్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. విచారణ జరిపిన రాచకొండ పీపీ ఎస్ఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ షంషుద్దీన్, కానిస్టేబుళ్లు తౌసీఫ్, శ్రీనివాస్ లను సస్పెండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates