రికార్డులు బద్దలు కొట్టిన రేట్లు : పెట్రోల్ ధరల కంటే.. ఎండలే నయం

petrol-hikeఆకాశంలోకి తారాజువ్వు ఎలా వెళుతుంది.. శ్రీహరి కోట నుంచి రాకెట్ ఎలా వెళుతుందో చూశారు కదా.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు అలాగే పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ రేటు ఎంతో తెలుసా.. అక్షరాల రూ.82.50. ఇది ఆల్ టైం రికార్డ్. ఇక లీటర్ డీజిల్ ఎంతో తెలుసా.. అక్షరాల రూ.77.73 ఇది ఇండియా రికార్డ్. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ లోనే డీజిల్ ధర అధికంగా ఉంది. పెట్రోల్ రేటులో నాలుగో స్థానంలో ఉంది హైదరాబాద్. 24 గంటల్లో లీటర్ పెట్రోల్ ఎంత పెరిగిందో తెలుసా.. ఒక రూపాయి 2పైసలు. డీజిల్ అయితే 73పైసలు. రెండేళ్ల క్రితం రెండు నెలలకు రూపాయి పెరిగితే గగ్గోలు పెట్టేశాం.. ఇప్పుడు ఒక్క రోజులో పెరిగింది ఆ రూపాయి.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.82.50 చేరుకోవటంపై భగ్గుమంటున్నారు వాహనదారులు. ఇవేమి రేట్లని మండిపోతున్నారు. రాత్రికి రాత్రి రూపాయి చొప్పున పెంచటం దారుణం అంటున్నారు. ఏడాదిగా రూపాయి జీతం పెరగలేదుకానీ.. వీళ్లు మాత్రం ఇష్టమొచ్చినట్లు బాదేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. గతంలో 100 రూపాయలకు పెట్రోల్ కొట్టించుకుంటే రెండు రోజుల తర్వాత బంకుకి వెళ్లేవారం.. ఇప్పుడు సాయంత్రమే వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

డీజిల్ అయితే రూ.74.73గా ఉంది. పెట్రోల్ ధరతో పోల్చితే ఇది చాలా తక్కువ. గతంలో రూ.20-25 తేడా ఉండేది. ఇప్పుడు అది రూ.8 తగ్గిపోయింది. డీజిల్ రేట్లు ఇంతలా పెరగటంతో సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా నిత్యావసర ధరలు రోజువారీగా మారిపోతున్నాయి. నిన్నటికి నిన్న 10 రూపాయలు ఉండే కూరగాయలు.. ఇవాళ 12 రూపాయలు అయ్యింది. ఏమైనా అంటే… నిన్న ఉన్న డీజిల్ ధర.. ఇవాళ ఉందా అని వ్యాపారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates