రికార్డ్ : 1500 కిలోల డ్రై ఫ్రూట్స్ తో మొక్కులు

dryదేవుడిపై భక్తితో రికార్డును సృష్టించారు గుజరాతీ భక్తులు. పూజలు చేయడంలో స్పెషల్ గా ఆలోచించే గుజరాతీలు..  వడోదరలో  తమ ఇష్టమైన దేవుడికి..15వందల  కిలోల  డ్రైఫ్రూట్స్ తో  మొక్కులు చెల్లించుకున్నారు. పురుషోత్తమ్ మాసంలో..వడోదరలోని  హవేలీ  టెంపుల్ లో  ఈ పూజలు చేశారు.

పూజల తర్వాత డ్రైఫ్రూట్స్ ని …భక్తులకు  పంచారు. అధిక  మాసంలో దేవుడికి వివిధ  రకాల్లో  నైవేద్యం పెట్టడం  ఆచారం అంటున్నారు  గుడి పూజారులు. అయితే తమలాపాకులతో, పండ్లు, కూరగాయలతో దేవుళ్లుకి మొక్కులు చెల్లించుకోవడం ఇప్పటివరకు చూశాం. ఫస్ట్ టైం 15 వందల కిలోల డ్రై ఫ్రూట్స్ తో పూజలు చేయడం ఓ రికార్డే అంటున్నారు ఆలయ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates