రిజర్వేషన్లు 50శాతం దాటొద్దు: సుప్రీంకోర్టు

రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు… రిజర్వేషన్లు 50% కంటే మించొద్దని స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్నందున రిజర్వేషన్లు పెంచుకునేందుకు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఐతే… ఆ మినహాయింపులేవి ఇకమీదట ఉండబోవని సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును కోరింది. ఐతే… రిజర్వేషన్లు పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

 

Posted in Uncategorized

Latest Updates