రిజర్వేషన్ ఉద్యోగుల ప్రమోషన్లు : సుప్రీం గ్రీన్ సిగ్నల్

SUPREMEదేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా SC, ST ఉద్యోగుల ప్రమోషన్ల విషయంపై గందరగోళంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. SC, ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ పై మంగళవారం (జూన్-5) తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. SC, ST  ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలుకు చట్ట ప్రకారం ముందుకెళ్లవచ్చని సుప్రీం కోర్టు కేంద్రాన్ని అనుమతించింది.

వివిధ హైకోర్టులు, 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన యథాతథ ఉత్తర్వుల కారణంగా మొత్తం ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని కేంద్రం నివేదించడంతో జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ లతో కూడిన సుప్రీం బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి ప్రమోషన్ల ప్రకియకు అనుమతిస్తూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Posted in Uncategorized

Latest Updates