రిజిస్ట్రేషన్ ఆపితే అధికారులకు రోజుకి వెయ్యి రూపాయల ఫైన్

kcrరైతులకు సంబంధించిన మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషమన్నారు సీఎం కేసీఆర్. రాజేంద్రనగర్‌లో జరుగుతున్న రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో కేసీఆర్‌ మాట్లాడారు. వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీయడంతో వర్షాలు కురవడంలో హెచ్చుతగ్గులు సంభవిస్తున్నాయన్నారు. రైతు బాగుపడిన రోజే అందరికీ నిజమైన పండుగ అన్న సీఎం.. పంట సాయం పథకానికి 12 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. రైతులకు అనుకూలంగా అధికారులు పని చేయాలన్నారు. రెండు గంటల్లోనే భూమి రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని…ఏ మండలానికి ఆ మండల MROనే రిజిస్ట్రార్‌గా ఉంటారన్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ కోసం లంచాలు ఇవ్వడం వద్దన్నారు. పాస్ బుక్ ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున ఫైన్ విధిస్తామన్నారు.

రిజిస్ట్రేషన్ ఆపితే అధికారులకు రోజుకి వెయ్యి రూపాయల ఫైన్ విధిస్తామన్నారు. అంతేకాదు రైతు చనిపోతే.. వెంటనే ఆయన భార్య పేరుపై భూబదలాయింపు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.పాస్ పోర్టు వచ్చినట్టే పాస్ బుక్కులు కూడా పోస్టులో ఇంటికి వస్తాయన్నారు. నకలీ విత్తనాల సమస్యను గ్రామ రైతు సమన్వయ సమితులే ఎదుర్కోవాలన్నారు. రైతు పంట సాయాన్ని తాను తీసుకోవడం లేదన్న సీఎం కేసీఆర్ …పంట సాయం వద్దనుకునే వాళ్లు వెనక్కి ఇవ్వొచ్చన్నారు. 5వేల ఎకరాలకు నాట్లు వేసే యంత్రాలను 50శాతం సబ్సిడీతో ఇస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates