రిపబ్లిక్‌డే ముఖ్య అతిథిగా ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆహ్వానించింది భారత ప్రభుత్వం. వచ్చే ఏడాది రిపబ్లిక్‌డేకి ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల్సిందిగా కోరింది. రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయ‌ని తెలియజేసేందుకు ట్రంప్‌ను భారత్‌ ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయానికి అమెరికా దౌత్య అధికారుల‌తో ప‌లుమార్లు చర్చలు జరిపిన  తర్వాత ట్రంప్‌కు ఆహ్వానం పంపారు. అమెరికా నుంచి దీనికి అధికారికంగా సమాధానం రావాల్సి ఉంది.

ట్రంప్ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లాంఛ‌న‌మేన‌ని… అన్ని ర‌కాల ముందుస్తు చ‌ర‍్చలు జరిపిన తర్వాతే  ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల వివిధ దేశాలతో వాణిజ్య విష‌యాల్లో వివాదాస‍్పద నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్‌.. భారత్‌ను కూడా టార్గెట్‌ చేశారు. అయితే  మోడీ ఆహ్వానాన్ని అంగీకరించే అవకాశాలు అధికంగా ఉన‍్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి.

Posted in Uncategorized

Latest Updates