రిపోర్టర్ ప్రసన్న కుటుంబానికి మంత్రి హరీశ్ ఆర్థికసాయం

prasannaరోడ్డు ప్రమాదంలో చనిపోయిన మెదక్ జిల్లా వీ6 స్టాఫ్ రిపోర్టర్ ప్రసన్న కుటుంబానికి అండగా నిలిచారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. ప్రసన్న కుటుంబ సభ్యులకు సొంతంగా 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 న రాజీవ్ గాంధీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ప్రసన్న.

ప్రమాదం జరిగిన రోజు వెంటనే హైద్రాబాద్ లో ఉన్న మంత్రి.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో ప్రసన్న మృతదేహానికి నివాళులర్పించి.. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. ప్రసన్న తల్లి, భార్యను హైదరాబాద్ పిలిపించి ఆర్థిక సాయాన్ని అందించారు హరీష్ రావు. భార్య, తల్లికి చెరో రూ.2.50లక్షల చొప్పున నగదు అందించారు మంత్రి. భవిష్యత్ లోనూ ఆ కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates