రియల్ పోలీస్: క్యాన్సర్ తో బాధపడుతున్నా..డ్యూటీ మస్ట్ అంటున్నాడు

మనలో చాలా మంది చిన్నపాటి అనారోగ్యానికే ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక జాబ్ చేసే వారైతే రెస్ట్ తీసుకోవడానికి ఆఫీసులకు లీవ్స్ పెట్టేస్తారు. అయితే  క్యాన్సర్ మహ్మమారి తన  ప్రాణాలను తోడేస్తున్నా డ్యూటీనే ఫస్ట్  అంటున్నాడు మధ్యప్రదేశ్ కు చెందిన పోలీస్ అధికారి. మధ్యప్రదేశ్ లోని బడ్వానీ పోలీస్ స్టేషన్ లో ASI గా విధులు నిర్వర్తిస్తున్న మోహన్ తివారీ కొంతకాలంగా నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దీంతో డాక్టర్స్ అతడిని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

కానీ డ్యూటీ అంటే ప్రాణమిచ్చే మోహన్ ఒకవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే డ్యూటీకి అటెండ్ అవుతూ రియల్ పోలీస్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం మోహన్ తివారీ వయసు 60 సంవత్సరాలు.. గవర్నమెంట్ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ వయసును  ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో ఆయనకు మరో రెండేళ్లు డ్యూటీ చేసే ఛాన్స్ దొరికింది. ఈ వ్యాధి తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా డ్యూటీను తన ఫస్ట్ ప్రయార్టీ అని మోహన్ గర్వంగా చెపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates