రియల్ స్టార్ : రైతులకు కోటి విరాళం ఇచ్చిన హీరో

తమిళ హీరోలు రైతులకు తమవంతు సాయంచేస్తూ.. రియల్ హీరోలుగా నిలుస్తున్నారు. ఇటీవల విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమా హిట్ కావడంతో తెలుగు రైతుల కోసం సాయం అదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో వెళ్లాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. కార్తి హీరోగా సూర్య నిర్మించిన సినిమా చినబాబు. ఈ మూవీ హిట్ కావడంతో తమిళ రైతులకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి, అన్నదాతల మనసు గెలిచాడు సూర్య.

రైతుల ప్రాధాన్యం, కుటుంబ విలువల్ని తెలుపుతూ తెరకెక్కిన చినబాబు ఇటీవల విడుదలై మంచి టాక్‌ అందుకుంది. విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది. అంతేకాదు తొలివారంలో తమిళనాడు వ్యాప్తంగా రూ.20 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే మంగళవారం (జూలై-24) చినబాబు విజయోత్సవ వేడుకను నిర్వహించారు. సూర్య, కార్తి, పాండిరాజ్‌, సత్యరాజ్‌ యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా సూర్య తన నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ తరఫున తమిళనాడు రైతుల సంక్షేమ సంఘం ఆగ్రం ఫౌండేషన్‌ కు రూ.కోటి విరాళంగా అందించాడు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సూర్య మంచితనాన్ని అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కార్తి హీరోగా నటించిన చినబాబును తమిళంలో కడైకుట్టిసింగం టైటిల్‌ తో విడుదల చేశారు.

Posted in Uncategorized

Latest Updates