రియల్ హీరో ఈ దేవరకొండ : ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేలం వేస్తా.. సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తా

viajమరోసారి నెటిజన్ల మనసుల్ని గెల్చుకున్నాడు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ. హైదరాబాద్ లో జరిగిన  65 జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2018 లో భాగంగా బ్లాక్ బస్టర్ హిట్ అర్జున్ రెడ్డి సినిమాలో అద్బుతమైన నటనకు.. బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకున్నాడు. తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు విజయ్ దేవరకొండ.

ప్రతిరోజూ ట్విట్టర్ లో చూస్తున్నా.. ఎన్నో వినతులకి కేటీఆర్ అన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తున్నారు. నా ఫస్ట్ అవార్డ్ ని వేలం వేసి ఆ వచ్చిన డబ్బుని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తాను. దీంతో చాలా మందిలో దీనిపై అవగాహన వస్తుంది అంటూ విజయ్ ట్వీట్ చేశారు. ఈ అవార్డుని నా సిటీ కోసం ఉపయోగిస్తున్నానని విజయ్ దేవరకొండ తెలిపారు. నటుడిగా ఉండటమే తనకు గొప్ప విజయమని, ఈ అవార్డులన్నీ తనకు బోనస్ అని తెలిపారు.

విజయ్ ట్వీట్ కు ట్విట్టర్ ద్వారా రిప్లయి ఇచ్చారు కేటీఆర్. ఫిల్మ్ ఫేర్ అవార్డు సాధించిన విజయ్ దేవరకొండకు అభినందనలు. సీఎం రిలీఫ్ ఫండ్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డుని ఇస్తానన్ని ప్రకటించిన విజయ్ ను అభినందించారు కేటీఆర్. మే 9న తన బర్తడే సందర్భంగా ఎండలతో మాడిపోతున్న సిటీ ప్రజలకు ఫ్రీగా ఐస్ క్రీమ్ పంచి తన మనసుని చాటుకున్నారు విజయ్ దేవరకొండ.

Posted in Uncategorized

Latest Updates