రియాల్టీ షోలో అరాచకం : చిన్నారులకు ముద్దులు పెడుతూ వేధించిన జడ్జి

Singer-Paponటీవీ పెడితే చాలు.. బోలెడు రియాల్టీ షోలు. చిన్ని పిల్లలు ముద్దు ముద్దుగా వేసే స్టెప్పులతో హోరెత్తిపోతుంది. ఇంట్లో కూర్చుని టీవీల ముందు చూసే పేరంట్స్ అయితే పిల్లల ముఖం చూస్తారు.. మీరు కూడా నేర్చుకోండి రా.. అలా డ్యాన్స్ చేయాలి.. అంటూ చెబుతుంటాం. ఇదందా తెరపైనే. తెర వెనక జరిగేది ఎవరికి తెలుసు. కానీ ఇప్పుడు తెలిసింది. ఓ రియాల్టీ డాన్స్ షో జడ్జిగా వ్యవహరిస్తున్న పాప్ సింగర్ అరెస్ట్ తో దేశం షాక్ అయ్యింది.

ప్రముఖ అస్సామీ సింగర్ పాపోన్.. హోలీపై ఓ రియాల్టీ షో చేశాడు. ఈ షోలో పాల్గొన్నది అందరూ చిన్న పిల్లలు. అందరి వయస్సు 13 ఏళ్ల లోపు అమ్మాయిలే. అందరికీ రంగులు పూస్తూ..పాటలు పాడుతూ గంతులేస్తున్న సింగర్ పాపన్ హడావిడి చేశాడు. చిన్నారుల ముఖాలపై రంగులు పూశాడు. అంతటితో ఆగలేదు. ముద్దులు పెట్టాడు. హోలీ రియాల్టీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షో ప్రమోషన్ కోసం.. కొంత భాగాన్ని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఓ అమ్మాయి ముఖంపై రంగు పూసి.. ముద్దు పెడతాడు. ఆ అమ్మాయి వద్దూ వద్దూ అని వారిస్తున్నా వినకుండా బలవంతంగా కిస్ చేస్తాడు.

అంతే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. చిన్న అమ్మాయిలతో ఇలా ప్రవర్తించటానికి సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలీవుడ్ సింగర్ పాపోన్ పై పోస్కో యాక్ట్ కింద ( మైనర్లపై లైంగిక వేధింపుల కింద) కేసు పెట్టారు. ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates