రిలయన్స్ జియోలో 80 వేల ఉద్యోగాలు

Mukesh-770x433టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ భారీగా ఉద్యోగాల నియామకాలకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది దాదాపు 80 వేల మంది ఉద్యోగులను నియమించడానికి రిలయన్స్‌ జియో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కంపెనీ విస్తరణ ప్రక్రియలో భాగంగా ఈ నియామకాలను చేపడుతోంది జియో. ఇప్పటి వరకు రిలయన్స్ జియో కంపెనీలో 1,57,000 మంది ఉద్యోగులున్నారని, మరో 75 వేల నుంచి 80 వేల మందిని నియమించుకోనున్నామని చెప్పారు జియో చీఫ్‌ హ్యుమన్‌ రిసోర్సస్‌ ఆఫీసర్‌ సంజయ్‌ జాగ్‌.

కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని, దీనిలో టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్లు కూడా ఉన్నాయన్నారు జాగ్‌. ‘రిలయన్స్‌ రెడీ’అనే దాని కోసం కొన్ని కోర్సులను కూడా ఈ కాలేజీలు ఆఫర్‌ చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ సహకారంతో కూడా నియామకాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు ఆయన. రిఫెరల్స్‌ ద్వారా 60 శాతం నుంచి 70 శాతం నియమిస్తున్నామని, తమ రిక్రూట్‌మెంట్‌ ప్లాన్‌లో కాలేజీలు, ఎంప్లాయీ రిఫెరల్స్‌ ప్రధాన భాగాలని  చెప్పారు జాగ్‌.

Posted in Uncategorized

Latest Updates