రిలీజ్ కు ముందే కార్తి-రకుల్ ల ఫుల్ వీడియో సాంగ్

కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి మరో సారి ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నారు.  ఖాకీ సినిమాలో వీరిద్దరి జోడి సూపర్బ్ అనిపించుకున్నారు. లేటెస్ట్ గా రజత్ రవిశంకర్ డైరెక్షన్ లో కార్తి, రకుల్ కలిసి నటించిన సినిమా దేవ్. యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ.. ఫిబ్రవరి-14న రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా దేవ్ లోని ఓ ఫుల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. కార్తి, రకుల్ పాటలో రెచ్చిపోయి నటించారు. సినిమాకు ముందు ప్రమోషన్స్ పెంచడానికి.. పోస్టర్స్, ఆడియో, టీజర్, ట్రైలర్, మేకింగ్, సాంగ్ ట్రైలర్స్ రిలీజ్ చేయడం కామన్. కానీ ఈ సినిమా యూనిట్ .. విడుదలకాకముందే సినిమాలోని ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

 

Latest Updates