రివ్యూ : అభిమన్యుడు

abhimanyuduరన్ టైమ్ : 2 గంటల 27 నిమిషాలు

నటీనటులు : విశాల్, అర్జున్, సమంత, ఢిల్లీ గణేష్, రోబో శంకర్ తదితరులు

సినిమాటోగ్రఫీ : జార్జ్.సి.విలియమ్స్

మాటలు : శశాంక్ వెన్నెలకంటి

మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా

నిర్మాత : హరి గుజ్జలపూడి

రచన, దర్శకత్వం : పి.ఎస్ మిత్రన్

రిలీజ్ డేట్ : జూన్ 1, 2018

కథ :

కోపం కారణంగా ఆర్మీ నుంచి సస్పెండ్ అయిన కారుణాకర్ (విశాల్).. సైకియాట్రిస్ట్ నుంచి సంతకం కోసం లతాదేవి (సమంత)ను కలుస్తాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ తరుణంలోనే తన చెల్లి పెళ్లి కోసం తీసుకున్న అప్పు తాలూకు డబ్బును అతని తండ్రి అకౌంట్ నుంచి హ్యాకర్స్ కొట్టేస్తారు. అది తెలుసుకునే భాగంలో కొన్ని వేల మంది ప్రజల డబ్బును వైట్ డెవిల్ (అర్జున్) వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా హ్యాక్ చేసి దొంగిలించాడని తెలుస్తుంది. అలా వైట్ డెవిల్ గురించి తెలుసుకున్న విశాల్.. అతన్ని ఎలా ఎదురుకున్నాడు. ఈ డిజిటల్ టెక్నాలజీ వల్ల ఎలాంటి హానికరం జరుగుతుంది. వైట్ డెవిల్ నుంచి జనాల సొమ్మును ఏ విధంగా రాబట్టుకున్నాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు :

ఆర్మీ ఆఫీసర్ గా విశాల్ మెప్పించాడు. తనకొచ్చిన సమస్యను ఎదుర్కునే కరుణాకర్ అనే క్యారెక్టర్ లో మంచి పర్ఫార్మెన్స్ అందించాడు. యాక్షన్, సెంటిమెంట్ సీన్లల్లో మెప్పించాడు. బలమైన విలన్ పాత్రలో అర్జున్ అద్భుతమైన నటన కనబరిచాడు. సైబర్ మాఫియా డాన్ పాత్రలో సెకండాఫ్ లో రాణించి.. సినిమాకు ప్లస్ అయ్యాడు. హీరోయిన్ సమంతకు మంచి రోల్ దక్కింది. కేవలం పాటలకే పరిమితం చేయకుండా హీరో ను మోటివ్ చేసే క్యారెక్టర్ లో ఆకట్టుకుంది. ఢిల్లీ గణేష్, రోబో శంకర్ అలవాటైన పాత్రల్లో రాణించారు.

టెక్నికల్ వర్క్:

టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. జార్జ్ సి.విలియమ్స్ కెమెరా పనితనం అబ్బురపరుస్తుంది. యువన్ శంకర్ రాజా పాటలు సోసో గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. విశాల్, అర్జున్ మధ్య సాగే డైలాగులు బాగున్నాయి. ఫస్టాఫ్ లో కొన్ని సీన్లకు కత్తెర పడాల్సింది. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా భారీగా తెరకెక్కించారు.

విశ్లేషణ:

‘అభిమన్యుడు’ ఓ సైబర్ క్రైమ్ థ్రిల్లర్. డిజిటల్ టెక్నాలజీ వల్ల మనకు తెలియకుండానే ఎలా మోసపోతున్నాం అనే ఇంట్రస్టింగ్ పాయింట్ ను రైజ్ చేశాడు డైరెక్టర్ పి.ఎస్ మిత్రన్. కొత్త వాడే అయినా.. ఇలాంటి ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ను ఎంచుకుని న్యాయం చేశాడు. ఫస్టాఫ్ లో ప్రేక్షకులను కథలోకి తీసుకుళ్లడానకి కొంత సమయం తీసుకున్న డైరెక్టర్.. ఆ తర్వాత మెరుపు వేగంతో సినిమాను నడిపించాడు. సెకండాఫ్ మొత్తం గ్రిప్పింగా సాగింది. విశాల్ – అర్జున్ మధ్య సీన్లు పోటాపోటీగా సాగుతాయి. తను చెప్పాలనుకున్న పాయింట్ ను హార్ట్ హిట్టింగ్ గా కన్వే చేశాడు డైరెక్టర్. స్మార్ట్ ఫోన్ల వల్ల ఎలాంటి మిస్ యూజ్ జరుగుతుంది.. మనకు తెలియకుండానే సైబర్ నేరాలు ఎలా జరుగుతాయనేది కళ్లకు కట్టినట్టు చూపించాడు. దాని కోసం దర్శకుడి చేసిన డీటెయిలింగ్, రీసెర్చ్ అభినందించాల్సింది. అప్రమత్తంగా లేకపోతే టెక్నాలజీ వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది బాగా చూపించాడు. ఈ సినిమాతో డైరెక్టర్ ఒకరకంగా ప్రజలను జాగ్రత్త పడేలా చేశాడని చెప్పొచ్చు. ఫస్టాఫ్ లో ఒకట్రెండు బోరింగ్ సీన్లు, సెకండాఫ్ లో కొన్ని సీన్లు లాజిక్ కు దూరంగా ఉండటం అనేది సినిమాలోని చిన్న చిన్న లోపాలు. ఇలాంటివి మినహాయిస్తే.. ‘అభిమన్యుడు’ తప్పకుండా మెప్పిస్తుంది.

బాటమ్ లైన్: అభిమన్యుడు అలర్ట్ చేశాడు

Posted in Uncategorized

Latest Updates