రివ్యూ: అరవింద సమేత

రన్ టైమ్ : 2 గంటల 47 నిమిషాలు

నటీనటులు: ఎన్టీఆర్, పూజా హెగ్డే, నాగబాబు, జగపతి బాబు, నవీన్ చంద్ర, సునీల్, ఈషా రెబ్బా, దేవయాని, రావు రమేష్, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ, శత్రు ఇతరులు.

సినిమాటోగ్రఫీ: పి.ఎస్ వినోద్

మ్యూజిక్ : తమన్

నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ

రచన,దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

రిలీజ్ డేట్: అక్టోబర్ 11,2018

కథేంటి?

నారపరెడ్డి (నాగబాబు), పెద్ది రెడ్డి (జగపతిబాబు) ల కుటుంబాలు ఫ్యాక్షన్ గొడవలతో రక్తసిక్తమవుతుంటాయి. బయట దేశం నుండి వచ్చిన వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్) ముందే ఆయన తండ్రిని చంపేస్తాడు పెద్దిరెడ్డి. కోపంతో రగిలిపోయిన వీర రాఘవ శత్రువులను నరికేస్తాడు. కానీ ఇంటికొచ్చిన తర్వాత వాళ్ల నాన్నమ్మ ఈ పగలు చల్లార్చమని, చాలా మంది ఆడవాళ్లు అభాగ్యులవుతున్నారని వేడుకుంటుంది. ఆమె మాటలను విన్న రాఘవ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడతాడు. పగతో రగిలిపోతున్న శత్రువును ఏ విధంగా సంధికి ఒప్పించి.. ఫ్యాక్షనిజాన్ని ఎలా అంతమొందించాడన్నదే కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

ఎన్టీఆర్ ఈ సినిమాకు ప్రధాన బలమయ్యాడు. తన సటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సినిమాను తన భుజాలమీద మోసాడని చెప్పాలి. సీమ యాసలో మాట్లాడి అలరించాడు. మొదటి యాక్షన్ ఎపిసోడ్ లో వీరత్వం ప్రదర్శించి విజిల్స్ కొట్టించేలా చేసాడు. పూజా హెగ్డే గ్లామరస్ గా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది. రంగస్థలం తర్వాత జగపతి బాబు మరోసారి క్రూరమైన నటన కనబరిచాడు. సీమ ఫ్యాక్షనిస్టుగా తన గెటప్, యాస అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. సునీల్ సినిమా మొత్తం ఉన్నా కానీ.. పెద్ద ఇంపార్టెన్స్ లేదు. నవీన్ చంద్రకు మంచి క్యారెక్టర్ దక్కింది. బాల్ రెడ్డిగా మంచి పర్ఫార్మెన్స్ అందించాడు. బ్రహ్మాజీ, శత్రులకు కూడా మంచి వేషాలు దక్కాయి. ఈషా రెబ్బా ఓకే. ఈశ్వరీ రావు ఉన్నది తక్కువ టైమే అయినా.. బాగా చేసింది.

టెక్నికల్ వర్క్:

పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బిగ్ ఎస్సెట్. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. తమన్ ఇచ్చిన పాటల్లో ఒకట్రెండు ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తన పనితనం చూపించాడు. చాలా సీన్లను ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ల గురించి. మొదటి 20 నిమిషాల్లో పెట్టిన యాక్షన్ ఎపిసోడ్ అయితే పీక్స్. ఆ ఫైట్ ను భలే కంపోజ్ చేశారు. సెకండాఫ్ లో వచ్చే మరో రెండు యాక్షన్ సీన్లు కూడా బాగుంటాయి. డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. కొన్ని డైలాగులకు ఈలలు వేయడం ఖాయం.

విశ్లేషణ:

త్రివిక్రమ్ రైటింగ్ కు ఎన్టీఆర్ లాంటి నటుడు తోడైతే రిజల్ట్ ‘‘అరవింద సమేత’’లాగా ఉంటుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ మాస్ ఎంటర్ టైనర్ ను ఎన్టీఆర్ తన సటిల్డ్ పర్ఫార్మెన్స్ తో నిలబెట్టాడు. సినిమా మొదలైన 20 నిమిషాల్లోనే అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ తో మైండ్ పోయేలా చేశాడు త్రివిక్రమ్. కానీ కథ సిటీకి షిప్ట్ అయిపోయిన తర్వాత స్లో అయ్యింది. అక్కడ లవ్ ట్రాక్ సరిగా లేకపోవడం, కామెడీ కోసం చేసిన ప్రయత్నం ఆకట్టుకోకపోవడం వల్ల సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాదు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ఇక్కడ వర్కవుట్ అవ్వలేదు. డైలాగ్ రైటర్ గా అలరించిన త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రచయితగా మాత్రం మెప్పించలేకపోయాడని చెప్పాలి. ఇలా అయినప్పుడల్లా ఎన్టీఆర్ తన నటనతో సినిమాను మోశాడు. తద్వారా సినిమాకు ప్రధాన బలమయ్యాడు. సెకండాఫ్ లో తారక్ మరింత విజృంభించాడు. నవీన్ చంద్రతో మీటింగ్ సీన్ లో అదరగొట్టాడు. క్లైమాక్స్ లో కూడా ఎమోషన్ పండించాడు. ఓవరాల్ గా త్రివిక్రమ్… తారక్ ను వాడుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని చెప్పొచ్చు. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే మూవీ కాకపోయినా.. డిజప్పాయింట్ మాత్రం చెయ్యదు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగుల కోసం చూసేయచ్చు. దసరా హాలీడేస్ కాబట్టి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే ఉంటుంది.

బాటమ్ లైన్: ఎన్టీఆర్ వన్ మాన్ షో

 

Latest Updates