రివ్యూ: అ

AWE-Movie-Reviewరన్ టైమ్: 1 గంట 55 నిమిషాలు

నటీనటులు: కాజల్,నిత్యా మీనన్,రెజీనా,ఈషా,అవసరాల శ్రీనివాస్,ప్రియదర్శి,మురళీ శర్మ తదితరులు

సినిమాటోగ్రఫీ:  కార్తీక్ ఘట్టమనేని

మ్యూజిక్: మార్క్ రాబిన్

నిర్మాత: నాని,ప్రశాంతి త్రిపురనేని

కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 16,2018

కథేంటి?

‘‘అ’’ సినిమాది ఓ భిన్నమైన కథ.. ఇప్పటివరకు ఇలాంటి కథతో తెలుగులో రాలేదనే చెప్పాలి.. ఈ స్టోరి అంతా ఒకే రెస్టారెంట్ లో జరుగుతుంది.. వంట రాకపోయినా.. డబ్బులకోసం ఉద్యోగం చేయాలనుకునే చెఫ్(ప్రియదర్శి), తనే గ్రేట్ అని విర్రవీగే ఓ మెజీషియన్ (మురళీ శర్మ), డ్రగ్స్ కు అలవాటు పడిన ఓ వెయిటర్ (రెజీనా), చిన్నప్పటి నుంచి లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి (ఇషా) ఓ లేడి సైక్రియాట్రిస్ట్ (నిత్యా మీనన్) ను పెళ్లి చేసుకోవాలనుకోవడం..,చిన్నప్పుడే అమ్మనాన్నలను కోల్పోయిన వ్యక్తి (అవసరాల శ్రీనివాస్) ఓ టైమ్ మిషన్ ను కనిపెట్టి తద్వారా గతం లోకి వెళ్లి తన పేరెంట్స్ ను రక్షించుకోవాలనుకోవడం.. ఇలా అందరి కథలు ఓకే దగ్గర జరుగుతుంటాయి.. వీళ్ల కథలకు మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ (కాజల్) కు ఎదో లింక్ ఉంటుంది.. అదేమిటీ,చివరికీ వీళ్లందరి కథలు ఏమయ్యాయి అన్నది సస్పెన్స్.

నటీనటులు పర్ఫార్మెన్స్:

డిఫరెంట్ కథకు తగ్గట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్ రాసుకున్నాడు డైరెక్టర్.. అందరూ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్టు నటించి మెప్పించారు.మనకు ఆర్టిస్టులు కనపడరు..కేవలం వాళ్ల పాత్రలే కనిపిస్తాయి.ప్రియదర్శి,మురళీ శర్మ ల నటన అందరికంటే ఎక్కువ మెప్పు పొందుతుంది.రెజీనా,కాజల్,నిత్యా మీనన్,ఈషా,అవసరాల శ్రీనివాస్ బాగా చేశారు.ఓ చెట్టుగా రవితేజ వాయిస్, ఓ చేపగా నాని వాయిస్ లు ఎంటర్ టైన్ చేస్తాయి.

టెక్నికల్ వర్క్:

ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాకు కావాల్సిన బ్రిలియంట్ టెక్నికల్ వర్క్ ను బాగా రాబాట్టుకున్నాడు డైరెక్టర్.కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రపీ నీట్ గా ఉంది..మార్క్ రాబిన్ మ్యూజిక్ డిఫరెంట్ మూడ్స్ ను బాగా క్యారీ చేసింది.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహి సురేష్ ఆర్ట్ వర్క్ గురించి.. ఒకే రెస్టారెంట్ లో జరుగుతున్న కథే అయినా..ఓక్కో క్యారెక్టర్ స్టోరికి తగ్గట్టు డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది.ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి..సంభాషణలు ఆకట్టుకుంటాయి.. నాని,రవితేజల తో చెప్పించిన కొన్ని ఫన్నీ డైలాగులు బాగున్నాయి.

ప్లస్ లు:

  1. డిఫరెంట్ కాన్సెప్ట్
  2. నటీనటుల పర్ఫార్మెన్స్
  3. టెక్నికల్ వర్క్

మైనస్ లు:

  1. కన్ఫ్యూజన్ ప్లాట్
  2. ఆకట్టుకోని కథనం
  3. బోరింగ్ సెకండాఫ్

విశ్లేషణ:

‘‘అ’’ ఓ ఔట్ ఆఫ్ ది బాక్స్ అటెంప్ట్..అయితే ఇందులో చాలా కాంప్లికేటెడ్ లేయర్స్ ఉండడంతో అందరి మెప్పు పొందదు.కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ కథ పేపర్ మీద అనుకున్నప్పుడు కొత్తగానే అనిపించవచ్చు కానీ..అందరికీ అర్థమయ్యే విధంగా తెరకెక్కించడం మాత్రం రిస్కే.ఈ విషయంలో ప్రశాంత్ వర్మ ఆడియన్స్ గందరగోళానికి గురి చేశాడు.. క్లైమాక్స్ లోనే అసలు విషయం ఉండటం వల్ల అప్పటివరకు ఏం జరుగుతుందో అర్థంకాదు.ఒక్కో క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్ ను ఆడియన్స్ కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ విఫలం అయ్యాడనే చెప్పాలి.కొత్త దర్శకుడైనా ఇలాంటి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో సినిమా తీయాలనుకోవడం మెచ్చుకునే అంశం. టెక్నికల్ టీమ్,ఆర్టిస్టుల నుండి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడంలో,మల్టిపుల్ జానర్ లను హ్యాండిల్ చేయడంలో దర్శకుడు ప్రతిభ కనిపిస్తుంది. ప్రశాంత్ నుంచి ఫ్యూచర్లో డిఫరెంట్ సినిమాలను ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్ మూవీని నిర్మించడానికి ముందుకొచ్చిన హీరో నానిని అప్రిషియేట్ చేయాలి. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కు నచ్చినా..ఇది అందరికీ రుచించదు.

Posted in Uncategorized

Latest Updates