రివ్యూ : ఆఫీసర్

OFFICER REVIEWసినిమా : ఆఫీసర్

నిర్మాణ సంస్థ‌: ఎ కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌

తారాగ‌ణం: నాగార్జున అక్కినేని, మైరా సరీన్‌, అజ‌య్‌, షాయాజీ షిండే, ఫిరోజ్ అబ్బాసీ, బేబి కావ్య త‌దిత‌రులు

సంగీతం: ర‌విశంక‌ర్‌

ఛాయాగ్ర‌హ‌ణం: ఎన్‌.భ‌ర‌త్‌ వ్యాస్‌, రాహుల్ పెనుమ‌త్స‌

నిర్మాత‌లు: రామ్ గోపాల్ వ‌ర్మ‌, సుధీర్ చంద్ర‌

ద‌ర్శ‌క‌త్వం: రామ్‌ గోపాల్ వ‌ర్మ‌

విడుదల : శుక్రవారం, జూన్-1 2018

25 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హీరో నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆఫీసర్. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీతో నాగార్జున, వర్మ మ్యాజిక్ ను రిపీట్ చేసారా లేదా రివ్యూలో  చూద్దాం..

స్టోరీ..

ముంబైలో నారాయణ్ పన్సారీ అనే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనిపై అవినీతి ఆరోపణలు వస్తాయి. దీంతో బాంబే హైకోర్టు హైదరాబాద్ కు చెందిన IPS ఆఫీసర్.. శివాజీరావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తుంది. కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ముంబైకి వచ్చిన శివాజీరావు ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు ను సాల్వ్ చేశాడా లేదా అనేదే ఈ సినిమా కథ. వర్మ మార్క్ కథే అయినా.. ఇందులో గ్యాంగ్ స్టర్స్ కాకుండా.. పోలీస్ ఆఫీసర్స్ మధ్య వార్ అనే అంశాన్ని తీసుకున్నాడు.

నటీనటులు :

నాగార్జున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. పోలీస్ ఆఫీసర్ గా.. ఒక కూతురుకి తండ్రిగా ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. నారాయణ పన్సారీగా చేసిన నటుడు తనదైన యాక్టింగ్ మెప్పించాడు. మరో పోలీస్ ఆఫీసర్ గా నటించిన హీరోయిన్ మైరా సరీన్ పర్వాలేదనిపించింది. అజయ్, నాగ్ కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సంఘాన్ని రక్షించే పోలీస్ ఆఫీసర్లే మాఫియాగా తయారైతే ఎలావుంటుందనే కాన్సెప్ట్ తో ఆఫీసర్ మూవీని తెరకెక్కించాడు. నాగ్ – వర్మ కాంబినేషన్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది శివ. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చినా.. ట్రెండ్ సెట్టర్ అదే. క్రైమ్, మాఫియా, పోలీస్ కథ ఆధారంగా వచ్చిన ఆఫీసర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గస్థాయిలో చిత్రీకరణ, లాజిక్స్ మిస్ అయ్యాయి ఆఫీసర్ మూవీలో. పాత్రలను బలహీనంగా చిత్రీకరించినట్లు ఫీలవుతాడు ప్రేక్షకుడు. విలన్.. ఓ పోలీస్ ఆఫీసర్. ఆయన మాఫియాతో చేతులు కలిపి.. హీరోపైనే పగ తీర్చుకోవటం అనేది లాజిక్ కు దూరంగా… అర్థం లేకుండా అనిపిస్తోంది ప్రేక్షకుడికి. కథ, కథనంలోని లోపాల వల్ల సినిమా నిదానంగా సాగుతుంది. ఎక్కడా ఉత్కంఠ, తర్వాత ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ లో ఉండడు ప్రేక్షకుడు. వర్మ గత చిత్రాలతో పోల్చుకుంటే.. విజువల్ మేకింగ్ ఏమంత ఆకట్టుకునే విధంగా లేదు. డైలాగ్స్ కూడా కనెక్ట్ కావు. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు.. అరే ఇక్కడ ఇలా చేయొచ్చు కదా అనే డౌట్ ప్రేక్షకుడికి సహజంగా రావటం మైనస్ పాయింట్. వర్మ తయారు చేసుకున్న కథ బాగున్నా.. దాన్ని మరింత అందంగా తెరకెక్కించటంలో కొన్ని లోపాలు బయటపడ్డాయి. సినిమా నిడివి గంటా 55 నిమిషాలు మాత్రమే ఉన్నా.. క్రిస్పీగా తీస్తే బాగుండేదన్న ఫీలింగ్ వెంటాడుతుంది ప్రేక్షకులకు. మూవీ క్లయిమాక్స్ ఇంటలెక్చువల్ గా తెరకెక్కించకుండా సాదాసీదాగా ముగించాడు.

Posted in Uncategorized

Latest Updates