రివ్యూ : ఇంటిలిజెంట్

Intelligent-movie-REVIEW-V6రన్ టైమ్: 2 గంటల 10 నిమిషాలు

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్‌,వినీత్ కుమార్, రాహుల్‌ దేవ్‌, దేవ్‌ గిల్‌, సప్తగిరి, బ్రహ్మానందం, ఆశిష్‌ విద్యార్ధి, సయాజీ షిండే తదితరులు.

మ్యూజిక్: తమన్

కథ,మాటలు: ఆకుల శివ

సినిమాటోగ్రాఫర్: విశ్వేశ్వర్

నిర్మాత: సి.కళ్యాణ్

స్క్రీన్ ప్లే,దర్శకత్వం: వి.వి వినాయక్

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 9,2018

 కథేంటి?

తేజ (సాయిధరమ్ తేజ్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పనిచేసే కంపెనీకి, యజమానికి నిజాయితీగా ఉంటూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక క్రిమినల్ గ్యాంగ్ తన బాస్ (నాజర్) ని చంపి కంపెనీని సొంతం చేసుకోవాలనుకుంటారు. అందరికీ సాయం చేసి,ఆశ్రయమిచ్చే తన బాస్ ను అన్యాయంగా చంపిన వాళ్ల మీద ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే స్టోరి.

నటీనటుల పర్ఫార్మెన్స్:

వినడానికి పెద్దగా పస లేని ఈ కథలో హీరో సాయిధరమ్ తేజ్ ఏమి చేయలేకపోయాడు.తనకు వచ్చిందేదో చేసుకుంటూ పోయినా..ఈ క్యారెక్టర్ తేజ్ కు హెవీ అయిపోయింది.హీరోయిన్ లావణ్య కేవలం పాటలకే పరిమితమైపోయింది.విలన్లు వినీత్ కుమార్, రాహుల్ దేవ్, దేవ్ గిల్ వీక్  అయిపోయి ఇరిటేట్ చేశారు.నాజర్,కాశీ విశ్వనాథ్,పోసాని,సప్తగరి,దువ్వాసి లు కొత్తగ చేసిందేమిలేదు.

టెక్నీషియన్స్ వర్క్:

సినిమాలో విషయం లేకపోయేసరికి టెక్నీషియన్స్ లు కూడా కాపాడలేకపోయారు.విశ్వేశ్వర్ కెమెరా వర్క్ రిచ్ గా ఉంది.తమన్ డిజప్పాయింట్ చేశాడు.పాటలు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్..దేంట్లోనూ తన మార్కు చూపించలేదు.నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్ గా తీసారు సినిమాను.. వెంకట్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్స్ బాగున్నాయి.ఎడిటింగ్ ఓకే. డైలాగులు,స్క్రీన్ ప్లే లల్లో ఏవి బాగా లేవు.

విశ్లేషణ:

వినాయక్ శైలిలో కమర్షియల్ మూవీగా మలచాలనుకున్న ‘‘ఇంటిలిజెంట్’’ ఆకట్టుకోలేకపోగా..ప్రేక్షకుల సహనం పరీక్షిస్తుంది.. మంచి కమర్షియల్ డైరెక్టర్ అయిన వినాయక్ నుంచి ఇలాంటి బోరింగ్ మూవీని ఎక్స్ పెక్ట్ చేయలేం.లాజిక్ లెస్ సీన్లు,పేలవమైన కథనం ఈ సినిమాకు పెద్ద మైనస్.. డ్రోన్ కెమెరా తో ఫ్లైట్ ను డైవర్ట్ చేయడం,సాఫ్ట్ వేర్ కంపెనీలో హ్యాకింగ్ వ్యవహారం సిల్లీగా అనిపిస్తాయి.ఇలాంటి కథను,కథనాన్ని యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఎలా ఒప్పుకున్నాడో అర్థంకాదు.ఒకట్రెండ్ కామెడీ సీన్లు తప్ప ఆద్యాంతం బోర్ కొట్టిస్తుందీ ‘‘ఇంటిలిజెంట్’’.. అన్నీ పక్కాగా ఉంటే ఓ మోస్తారు రివేంజ్ సినిమా అయ్యే చాన్సున్న ఈ కథను వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ లైట్ గా తీసుకోవడం ఒకింత ఆశ్చర్యపరుస్తుంది.. ‘‘ఇంటిలిజెంట్’’ టైటిల్ చూసి సినిమా చూద్దాం అనుకుంటే పొరపాటే..

Posted in Uncategorized

Latest Updates