రివ్యూ : కృష్ణార్జున యుద్ధం

reviewరన్ టైమ్ : 2గంటల 28 నిమిషాలు

నటీనటులు: నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సార్,  బ్రహ్మాజీ, నాగినీడు తదితరులు

సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని

మ్యూజిక్ : హిపాప్ తమిళ

నిర్మాతలు : షైన్ స్క్రీన్స్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : మేర్లపాక గాంధీ

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 12, 2018

కథేంటి?

చిత్తూరు జిల్లాలో చిల్లరగా తిరిగే కృష్ణ (నాని)కి హైదరాబాద్ నుంచి వచ్చిన రియా (రుక్సార్) పరిచయమవుతుంది. ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. సేమ్ టైమ్ ప్రాగ్ లో ఉండే రాక్ స్టార్ అర్జున్ (నాని)కి అమ్మాయిలంటే పిచ్చి. అలానే సుబ్బలక్ష్మి (అనుపమ)ని చూసి ఇష్టపడతాడు. వీళ్లిద్దరూ ఈ అమ్మాయిలనే పెళ్లి చేసుకుందామనుకుంటారు. అయితే ఎప్పుడూ అమ్మాయిలను యూజ్ చేసుకునే అర్జున్ అంటే సుబ్బలక్ష్మీకి నచ్చదు. తన ప్రేమను రిజక్ట్ చేసి హైదరాబాద్ వెళ్తుంది. అలాగే రియా.. కృష్ణను ప్రేమించడం లేదని వాళ్ల తాత (నాగినీడు) హైదరాబాద్ పంపుతాడు. వీళిద్దరు హైదరాబాద్ లో అదృశ్యం అవుతారు? ఆ మిస్సింగ్ వెనకున్న రీజన్ ఏంటి.. వాళ్లను కృష్ణ, అర్జున్ ఎలా కాపాడారు అన్నదే స్టోరి.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

నాని ఎప్పటిలాగానే బాగా నటించాడు. చిత్తూరు కుర్రాడిగా మాస్ లుక్ లో అలరించాడు. నాని చేసిన కామెడీ అలరిస్తుంది. కానీ అర్జున్ లుక్ కి మాత్రం సూట్ అవ్వలేదు. రాక్ స్టార్ గెటప్ లో విగ్, స్టైలింగ్ బాగోలేదు. అర్జున్ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ కు పెద్దగా స్కోప్ లేదు. అనుపమా పరమేశ్వరన్ అందం, అభినయం బాగుంది. మరో హీరోయిన్ రుక్సార్ ఫర్వాలేదనిపించింది. బ్రహ్మాజీ, ఫన్ బకెట్ ఫేం మహేష్ నవ్వించారు. నాగినీడు అలవాటైన పాత్రలో మెప్పించారు. విలన్ బ్యాచ్ లో ఎవ్వరూ గుర్తున్న ఆర్టిస్టులు లేరు.

టెక్నికల్ వర్క్:

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. దారి చూడు అనే సాంగ్ తప్ప హిపాప్ తమిళ పాటల్లో ఏవీ అకట్టుకోవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగోలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ లో కొన్ని సీన్లకు కత్తెర పడాల్సింది. ల్యాగ్ ఉంది. ఇక ఎప్పటిలాగానే డైలాగులు, పంచ్ ల్లో మేర్లపాక గాంధీ తన మార్కు కామెడీ పండించాడు.

ప్లస్ లు :

… నాని

… కామెడీ

మైనస్ లు :

… స్క్రీన్ ప్లే, డైరెక్షన్

… ఎడిటింగ్

… సెకండాఫ్

విశ్లేషణ:

కృష్ణార్జున యుద్ధం లో బర్నింగ్ ఇష్యూ అయిన ఉమెన్ ట్రాఫికింగ్ చూపించారు. ఇది ఎంగేజింగ్ గా, లాజిక్ గా తీస్తే మంచి సినిమా అవుతుంది. దానికి కమర్షియల్ టచ్ ఇచ్చేసరికి అసలు పాయింట్ డీవియేట్ అయ్యింది. ఆ కమర్షియల్ ప్రయత్నం కూడా సరిగా లేకపోయేసరికి టోటల్ మిస్ ఫైర్ అయ్యింది. నాని సేవింగ్ గ్రేస్ అయిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బలహీనతగా మారాయి. సినిమా లెంగ్తీ ఉండే సరికి బోర్ కొడుతుంది. ఫస్టాఫ్ లో కామెడీ తో పాస్ చేయించిన నాని, సెకండాఫ్ మాత్రం కాపాడలేకపోయాడు. స్టార్టయిన మొదటి సీన్ నుంచే తర్వాత ఏం జరుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. స్క్రీన్ ప్లే రైటర్ గా, డైరెక్టర్ గా ఫెయిలయ్యాడు మేర్లపాక గాంధీ. ఇలాంటి స్టోరీకి ఇంటెన్స్ సీన్లు, బలమైన ట్విస్టులు పెడితే చూడబుల్ గా ఉంటుంది. ఈ కథలో కావాలని ఇరికించిన కామెడీ, పాటలు విసుగుపుట్టిస్తాయి. తద్వారా కృష్ణార్జున యుద్ధం నిరాశపరుస్తుంది. తనకున్న ఆక్సెప్టెన్సీతో నెట్టుకొచ్చిన నాని.. ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర నిలబెట్టడం ప్రశ్నార్థకమే.

బాటమ్ లైన్ : యుద్ధంలో చేతులెత్తేసిన కృష్ణార్జునులు

Posted in Uncategorized

Latest Updates