రివ్యూ : గాయత్రి

gayathri_1రన్ టైమ్ : 2 గంటల 20నిమిషాలు
నటీనటులు: మోహన్‌ బాబు, మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్‌, అనసూయ

ఒకప్పడు టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన మోహన్ బాబు….చాలా రోజుల తర్వాత హీరోగా గాయత్రి సినిమా  చేశాడు. ఆర్. మదన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ల మోహన్ బాబే స్వయంగా నిర్మించాడు. తండ్రీ..కూతుళ్లు అనుబంధంతో తెరకెక్కిన ఈ మూవీతో మోహన్ బాబు సక్సెస్ అందుకున్నడా.. లేదా  చూద్దాం…

కథేంటి?
హీరో శివాజీ ఒక స్టేజ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడు తప్పిపోయిన తన బిడ్డ జ్ఞాపకార్థం… ఒక అనాథ శరణాలయం నడిపిస్తుంటడు. దాన్ని నడిపించడానికి నేరం చేసిన వాళ్ల ప్లేస్ లో తను జైలు జీవితం అనుభవిస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. అటువంటి శివాజీ…అనుకోని పరిస్థితితో అచ్చు తనలాగే వుండే గాయత్రి పటేల్ ప్లేస్ లో జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..  చివరకు జైలుకు వెళ్లిన శివాజీ విడుదలై…తన బిడ్డను కలుస్తాడా  లేదా  అనేదే గాయత్రి మూవీ స్టోరీ.

నటీనటులు పర్ఫార్మెన్స్:

మోహన్ బాబుకు ఇటువంటి పాత్రలు కొట్టిన పిండే అనే చెప్పాలి. ఈ మూవీలో శివాజీగా…గాయత్రి పటేల్ గా రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ ను ఎంతో ఈజ్ తో చేసి..నిజంగానే నట ప్రపూర్ణుడు అనే బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. యం.ఏ.ధర్మరాజు ఎం.ఏ మూవీ తర్వాత మోహన్ బాబు మరోసారి హీరో కమ్ విలన్ గా  ఆకట్టుకున్నాడు.  ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మోహన్ బాబు పాత్రలో ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు నటించాడు. అయితే ఆ పాత్రకు విష్ణు ఏమాత్రం న్యాయం చేయలేకపోయిండు. హీరోయిన్ శ్రియ పర్వాలేదనపించింది. మోహన్ బాబు…బిడ్డ క్యారెక్టర్ చేసిన నిఖిలా విమల్ ఓకే.  మిగతా క్యారెక్టర్స్ కు సినిమాలో అంతగా స్కోప్ లేదు.

టెక్నీషియన్స్:

ఆర్.మదన్ ఎనభైలనాటి కథతో గాయత్రి మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎసిపోడ్  ఏమాత్రం ఆకట్టుకోదు. ఎపుడో అరిగిపోయిన తండ్రీ కూతుళ్లు సెంటిమెంట్ నే గాయత్రి మూవీలో ఆడియన్స్ మీద రుద్దాడు. మోహన్ బాబు తప్పించి…మిగతా క్యారెక్టర్స్ పై అంతగా ఫోకస్ పెట్టలేకపోయాడు. మోహన్ బాబు మేకప్ విషయంలో కేర్ తీసుకుంటే బాగుండేది. ఇక రొటీన్ మ్యూజిక్ తో తమన్ బోర్ కొట్టించాడు.  పాటలు ఆకట్టుకోలేకపోయాయి.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం వున్నంతలో పర్వాలేదపించాడు. ఫోటోగ్రఫీ రిచ్ గా లేదు. మొత్తానికి మోహన్ బాబుతో 80ల నాటి  స్టీరీ, కథనంతో డైరెక్టర్ మదన్ ఆడియన్స్ ను  థియేటర్లకు రప్పించడం  కష్టమనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ : మోహన్‌ బాబు యాక్షన్.. డైలాగ్స్‌

మైనస్ పాయింట్స్ : సెకండ్‌ హాఫ్‌ స్లో నేరేషన్‌.. సాంగ్స్‌

బాటమ్ లైన్: తండ్రీ కూతురి సెంటిమెంటే గాయత్రి

Posted in Uncategorized

Latest Updates