రివ్యూ : గూఢచారి


రన్ టైమ్: 2 గంటల 27నిమిషాలు

నటీనటులు: అడవి శేష్, శోభితా దుళిపాళ్ల, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, వెన్నెల కిషోర్, మధు శాలినీ, అనీష్ కురివిళ్లా ఇతరులు

సినిమాటోగ్రఫీ : షానియల్ డియో

కథ : అడవి శేష్

స్క్రీన్ ప్లే : అడవి శేష్,శశికిరణ్ తిక్క

మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల

నిర్మాతలు : అభిషేక్ పిక్చర్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

డైరెక్షన్ : శశికిరణ్ తిక్క

రిలీజ్ డేట్ : ఆగస్ట్ 3, 2018

కథేంటి?

అర్జున్ (అడవి శేష్) తండ్రి నేషనల్ సెక్యురిటీ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు..ఓ ఆపరేషన్ లో టెర్రరిస్టుల చేతిలో హతమవుతాడు. తండ్రిని ఇన్సిపిరేషన్ గా తీసుకుని అర్జున్ కూడా అదే ఏజెన్సీలో చేరతాడు. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న అర్జున్ ‘త్రినేత్ర’  మిషన్ కు ఎంపికవుతాడు. తన తండ్రిని చంపిన ఉగ్రవాదులను హతమార్చి దేశానికి సేవ చేయాలనుకుంటాడు. ఆ ఉగ్రవాదులు ఆ ఎజెన్సీ పెద్దలను హతమార్చి ఆ నేరం అర్జున్ చేసినట్టుగా సృష్టిస్తారు. ఈ టెర్రరిస్టు గ్రూపు వెనక ఉన్నది ఎవరు? అర్జున్ని ఎందుకలా టార్గెట్ చేశారు. ఆ తర్వాత అర్జున్ తెలుసుకున్న భయంకర నిజాలేంటి అనేది స్టోరి.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

అడవి శేష్ అదరగొట్టాడు. మంచి నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న శేష్.. ఇందులో స్టార్ హీరో రేంజ్ లో అద్భుతమైన యాక్షన్ పండించాడు. అటు రైటర్ గా కూడా తన ముద్ర వేసి సినిమాకు మెయిన్ హైలైట్ అయ్యాడు. శోభిత గ్లామర్ ఒలకబోసింది. మరోసారి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్ రాణించారు. వెన్నెల కిషోర్ ది భిన్నమైన పాత్ర. తన శైలిలో ఎంటర్ టైన్మెంట్ పండిస్తూనే.. చివర్లో సర్ ప్రైజ్ ఇస్తాడు. చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చిన సుప్రియ అక్కినేనికి మంచి పాత్ర దక్కింది. తను బాగా చేసింది. మధుషాలిని, అనీష్ కురివిళ్లా తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ వర్క్:

టెక్నికల్ గా ఈ సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల గురించి.. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్రధాన బలమయ్యాడు.స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీ సీన్ ను తన మ్యూజిక్ తో బాగా ఎలివేట్ చేశాడు. షానియల్ డియో సినిమాటోగ్రఫీ టాప్ నాచ్..ప్రొడక్షన్ వాల్యూయ్స్ రిచ్ గా ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ లోనే అయినా.. మంచి ఔట్ పుట్ తీసుకున్నారు. డైలాగులు ఎఫెక్టివ్ గా ఉన్నాయి.ఎడిటింగ్ క్రిస్ప్ గా బాగుంది.

విశ్లేషణ:

‘‘గూడచారి’’ ఎంగేజింగ్ స్పై థ్రిల్లర్..ఈ మధ్య వచ్చిన యాక్షన్ సినిమాల్లో ది బెస్ట్ గా నిలుస్తుంది.ఆద్యాంతం థ్రిల్ చేస్తూ,ఊహించని ట్విస్టులతో కట్టిపడేస్తుంది. మొత్తం క్రెడిట్ రైటర్ అడవి శేష్, డైరెక్టర్ శశికిరణ్ తిక్క లకే వెళుతుంది. బాగా రాసుకుని, అద్భుతంగా ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ కొత్తవాడే అయినా ఇలాంటి స్పై సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా మొదలైనప్పటి నుంచి రేసీ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. అది ఎండ్ వరకు అలాగే మెయింటెన్ చేశాడు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన డీటెయిలింగ్, ప్రతి చిన్న లాజిక్ తో సహా ప్రతీది పక్కాగా ప్రజెంట్ చేశారు. యాక్షనే కాకుండా, ఎమోషనల్ గా కూడా ఈ సినిమా మెప్పిస్తుంది. తండ్రి కొడుకుల ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. లిమిటెడ్ బడ్జెట్ లో ఇంత మంచి ఔట్ పుట్ ను ఇచ్చినందుకు టీమ్ ను అప్రిషియేట్ చేయాల్సిందే. ముఖ్యంగా అడవి శేష్ అటు రైటర్ గా, ఇటు నటుడిగా రాణించాడు.‘క్షణం’ లాంటి థ్రిల్లర్ తర్వాత మరోసారి ఇలాంటి డిఫరెంట్ మూవీని ప్రజెంట్ చేసి టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. శేష్ చేసిన క్యారెక్టర్ స్టార్ హీరో పాత్రకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. హీరో ఎలివేషన్లు, మాస్ సీన్లు బోలెడున్నాయి. స్టార్ హీరో చేసి ఉంటే చాలా పెద్ద సినిమా అయ్యుండేది. అయినప్పటికీ ‘గూఢచారి’ బాక్సీఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. తెలుగులో డిఫరెంట్ సినిమాలు రావట్లేదు అని కంప్లయింట్ చేసే వాళ్లకు ఈ సినిమా పెద్ద రిలీఫ్ ఇస్తుంది.

బాటమ్ లైన్ : కట్టి పడేసే స్పై థ్రిల్లర్

Latest Updates