రివ్యూ: ఛల్ మోహన్ రంగా

chal-mahan-rangaరన్ టైమ్: 2 గంటల 28 నిమిషాలు.

నటీనటులు: నితిన్,మేఘా ఆకాష్, లిజీ,రావు రమేష్,మధునందన్,సత్య,ప్రభాస్ శీను,నర్రా శీను,కిరీటి,నరేష్,ప్రగతి, తదితరులు

సినిమాటోగ్రఫీ: నటరాజన్ సుబ్రహ్మణ్యం

సంగీతం: తమన్

ఎడిటర్: ఎస్.ఆర్ శేఖర్

కథ: త్రివిక్రమ్

నిర్మాతలు: ఎన్.సుధాకర్ రెడ్డి,పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్

రచన,దర్శకత్వం: కృష్ణ చైతన్య

రిలీజ్ డేట్: ఏప్రిల్ 5,2018

కథేంటి?

మోహన్ రంగా (నితిన్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఎలాగైనా అమెరికా వెళ్లి సెటిలవ్వాలనేది కోరిక..అక్కడికి వెళ్లిన తర్వాత మేఘా (మేఘా ఆకాష్) పరిచయమవుతుంది..ఒకర్నొకరు బాగా నచ్చి ప్రపోజ్ చేసుకుందాం అనుకుంటారు. ఫ్రెండ్స్ సలహా విని ఇద్దరూ మానేస్తారు. తర్వాత దూరమైపోతారు.  కొన్నాళ్లకు అదే నిజమైన ప్రేమని నమ్మి, మోహన్ రంగా ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఊటి వెళ్లిపోతాడు. తర్వాత కలుసుకున్నారా? వాళ్ల కథ ఎలా ముగిసింది అనేది కథ?

నటీనటుల పర్ఫార్మెన్స్:

అ,ఆ సినిమా తర్వాత నితిన్ నటుడిగా బాగా పరిణితి చెందాడు. కామెడీ టైమింగ్,ఎక్స్ ప్రెషన్స్ బాగా పలికించాడు. ఇందులో మధ్య తరగతి యువకుడి పాత్రలో కామెడీ బాగా చేశాడు. ఈ సినిమాకు తనే సేవింగ్ గ్రేస్. హీరోయిన్ మేఘా ఆకాష్ మైనస్. ఇలాంటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లో తను తేలిపోయింది. వేరే హీరోయిన్ ను పెట్టాల్సింది. సినీయర్ హీరోయిన్ లిజిని ఎందుకు పెట్టారో అర్థంకాదు. తను ఆ రోల్ కు సూట్ అవ్వలేదు. రావు రమేష్, నరేష్, ప్రగతిలు తమకు అలవాటైన పాత్రల్లో రాణించారు. మధునందన్, ప్రభాస్ శీను, నర్రా శీను, సత్య, పమ్మి సాయి తదితరులు కామెడీ కోసం పనికొచ్చారు.

టెక్నికల్ టీమ్ వర్క్:

టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. నటరాజన్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ, తమన్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా తీసారు. ఫన్ డైలాగులు బాగా పేలాయి. కృష్ణ చైతన్య బాగా రాసుకున్నాడు.

విశ్లేషణ

ఇప్పటివరకు మనం చాలా చూసేసిన స్టోరీనే ఈ ఛల్ మోహన్ రంగా ది కూడా.. త్రివిక్రమ్ నుండి ఇంత రొటీన్ కథ ఎక్స్ పెక్ట్ చేయం. ఆయన ఇచ్చిన కథ పాతదే కావచ్చు కానీ..దానికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వడంలోనూ  డైరెక్టర్ కృష్ణ చైతన్య ఫెయిలయ్యాడు. ఇద్దరు లవర్స్ మధ్య జరిగే కథలో ఆడియన్స్ ను సరిగా ఇన్వాల్వ్ చేయలేదు. ఎదో ఫ్లాట్ గా తీసేసారు కానీ..ఎక్కడా ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వదు. అయితే డైలాగ్ రైటర్ గా మాత్రం కృష్ణ చైతన్య ఆకట్టుకుంటాడు. కామెడీ పండించడంలో,పంచ్ డైలాగులు పేల్చడం లో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ లో హిలేరియస్ కామెడీ పండించాడు. లైట్ హార్టెడ్ గా వెళుతున్న ఈ స్టోరీలో సెకండాఫ్ లో బ్రేకులు పడ్డాయి. కామెడీ, ఎమోషన్ అన్నీ ఫోర్స్ డ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా లాగ్ చేయడంతో ఆడియన్స్ కు విసుగెత్తుతుంది. రొటీన్ లవ్ స్టోరి అయినా.. కొన్ని కామెడీ పంచ్ ల కోసం, టైమ్ పాస్ కోసం వెళితే ఓకే అనిపిస్తుంది కానీ.. పూర్తి స్థాయిలో ఈ మోహన్ రంగా అలరించడు.

బాటమ్ లైన్: బోరింగ్ రంగా..

 

Posted in Uncategorized

Latest Updates