రివ్యూ : తేజ్.. ఐ లవ్ యు

sai dharam tejరన్ టైమ్ : 2 గంటల 24 నిమిషాలు

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాష్, వైవా హర్ష, పవిత్రా లోకేష్, అనీష్ కురువిల్లా తదితరులు

సినిమాటోగ్రఫీ : ఐ.ఆండ్రూ

మ్యూజిక్ : గోపి సుందర్

మాటలు : డార్లింగ్ స్వామి

నిర్మాత : కె.ఎస్ రామారావు

స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : కరుణాకరన్

రిలీజ్ డేట్ : జూలై 6, 2018

 కథేంటి?

చెల్లికి లవ్ మ్యారేజ్ చేసి పంపాడని ఇంట్లో నుంచి వెళ్లగొడుతాడు హీరో తండ్రి.. ఇంటి నుంచి వెళ్లిపోయిన తేజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఓ మ్యూజిక్ ట్రూప్ నడుపుతుంటాడు. అప్పుడే నందిని (అనుపమ) పరిచయమవుతుంది. గొడవలతో మొదలైన వీరి స్నేహం తర్వాత ప్రేమగా మారుతుంది. ప్రపోజ్ చేసుకునే టైమ్ కు నందిని కి యాక్సిడెంట్ అయి గతం మర్చిపోతుంది. తర్వాత ఏం జరిగింది? తేజ్ తన ప్రేమను దక్కించుకున్నాడా లేదా అనేది సినిమా.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

సాయిధరమ్ తేజ్ మంచి పర్ఫార్మెన్స్ అందించాడు. బొద్దుగా కనిపించాడు. హీరోయిన్ అనుపమ అందంగా ఉంది. మంచి ఎక్స్ ప్రెసివ్ ఫేస్ కాబట్టి బాగా నటించింది. జయప్రకాష్, అనీష్ కురివిల్లా, పవిత్రా లోకేష్ తమ పరిధిమేర బాగా నటించారు. హీరో ఫ్రెండ్స్ గా నటించిన వైవా హర్ష, జోష్ రవి తప్ప ఎవరివి తెలిసిన ఫేస్ లు కావు.

టెక్నిషియన్స్ వర్క్:

ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫి బాగుంది. పాటల్లో లొకేషన్స్ అందంగా చూపించాడు. గోపి సుందర్ పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ లో కొన్ని సీన్లు కత్తెరించాల్సింది. డార్లింగ్ స్వామి రాసిన సంభాషణలు ఫర్వాలేదు.

విశ్లేషణ :

‘తేజ్ ఐ లవ్ యు’ రొటీన్ కరుణాకరన్ టెంప్లేట్ మూవీ. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా శైలిలోనే సాగుతుంది ఈ సినిమా కూడా. అప్పటికీ, ఇప్పటికీ కథలు మారాయి. ప్రేక్షకులు మారారు. కానీ తను మాత్రం ఇంకా అప్డేట్ కాకుండా.. రొమంటిక్ కామెడీ పేరుతో అవే సినిమాలు తీస్తున్నారు. ఈ ‘తేజ్’ కూడా ఆద్యంతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడు. అవే పాత సీన్లు, పాత కామెడీ, పాత ట్రీట్ మెంట్.. వెరసి ఈ సినిమా ఓ పాత చింతకాయ పచ్చడి. ఇంత ఔట్ డేటెడ్ కథను, స్క్రీన్ ప్లే ను హీరో, నిర్మాత ఎలా ఓకే చేశారో అర్థంకాదు. హీరో సాయిధరమ్ తేజ్ ఇకనైనా కథల ఎంపికపై దృష్టి సారిస్తే కెరీర్ గాడిలో పడుతుంది.

2 గంటలకు పైగా ఉన్న ఈ సినిమాలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఆకట్టుకోదు. ఫస్టాఫ్ లో కామెడీ ఎదైనా ఉంటుందని ప్రతీ సీను కు వెతుక్కోవడం. ఇంటర్వెల్ అయ్యాక సెకండాఫ్ లో ఎదైనా ఎమోషనల్ లవ్ స్టోరి ఉంటుందేమో అని వేచి చూడటం. క్లైమాక్స్ వచ్చేసరికి తొందరగా ముగించేయండి బాబు. అని పెదవి విరుస్తారు ఆడియన్స్. దీనంతటికీ కారణం డైరెక్టరే. ఏమాత్రం కొత్తదనం లేని, లాజిక్ లేని సీన్లు తీసి చేతులెత్తేసాడు. డైరెక్టర్ గా తన మార్కు ఎక్కడా చూపించలేదు. ఇక హీరోయిన్ కి యాక్సిడెంట్ అయి గతం మర్చిపోతుందట. కానీ.. కేవలం కొన్ని రోజుల క్రితం జరిగింది మాత్రం గుర్తుండదట. ఇలాంటి సిల్లీ కాన్సెప్ట్ ఎలా వర్కవుట్ అవుతుంది అనుకుంటారేమో దర్శక, నిర్మాతలు. ఓవరాల్ గా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన ‘తేజ్ ఐ లవ్ యు’ ప్రేక్షకులకు మాత్రం బ్యాడ్ ఫీల్ కలిగించింది.

బాటమ్ లైన్ : తేజ్.. వి పిటీ యూ..

Posted in Uncategorized

Latest Updates