రివ్యూ: తొలి ప్రేమ

tholi-prema-reviewరన్ టైమ్: 2 గంటల 16నిమిషాలు

నటీనటులు : వరుణ్ తేజ్, రాశి ఖన్నా, సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది, విద్యూ రామన్

మ్యూజిక్ : తమన్

సినిమాటోగ్రఫీ : జార్జ్.సి.విలియమ్స్

నిర్మాత : బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్

రచన, దర్శకత్వం : వెంకీ అట్లూరి

రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 10, 2018

కథేంటి?

తొలిప్రేమ కథ గురించి చెప్పుకోవాలంటే.. ఇది వరకు చాలా సినిమాల్లో చూసేసిన కథే. అబ్బాయి అమ్మాయిని చూసిన మొదటి చూపులోనే లవ్ పుట్టడం. తనని ఫ్లర్ట్ చేయడం. అమ్మాయికి ఇష్టం ఉండి వెనక తిప్పుకోవడం, ఫైనల్ గా ఐ లవ్ యూ చెప్పేస్తుంది. తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోవడం.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం. ఇలాంటి పాత కథనే కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు కొత్త డైరెక్టర్ వెంకీ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

‘‘ఫిదా’’ తర్వాత మరోసారి డీసెంట్ పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసాడు హీరో వరుణ్ తేజ్. లవ్, ఎమోషనల్ సీన్లల్లో పరిణితి కనబరిచాడు. హీరోయిన్ రాశీఖన్నా గురించి చెప్పుకోవాలి. అందంతోనే కాదు అభినయంతో కట్టిపడేసింది. 100శాతం న్యాయం చేసింది. తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ప్రయదర్శి, హైపర్ ఆది, విద్యు రామన్ ఎంటర్ టైన్ చేశారు. ఉన్నది తక్కువ నిడివియే అయినా.. నరేష్, సుహాసినీ మెప్పించారు.

టెక్నికల్ వర్క్:

ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామన్ జార్జ్.సి విలియమ్స్ ప్రాణం పోశారు. తమన్ పాటలు, ఆర్.ఆర్ తో మ్యాజిక్ చేస్తే.. ఫొటోగ్రాఫర్ జార్జ్ తన కెమెరాతో అద్భుతంగా చిత్రీకరించాడు. నవీన్ ఎడిటింగ్ బాగుంది. ప్రేమ గురించి డైరెక్టర్ వెంకీ రాసుకున్న డైలాగులు ఆకట్టుకుంటాయి.

ప్లస్ లు:

  1. వరుణ్ తేజ్
  2. రాశిఖన్నా
  3. మ్యూజిక్
  4. డైలాగ్స్, డైరెక్షన్

మైనస్ లు:

  1. అక్కడక్కడా స్లో నరేషన్

విశ్లేషణ:

‘‘తొలిప్రేమ’’ ప్రతీ ఒక్కరి తొలి ప్రేమను గుర్తు చేస్తుంది. కొత్తవాడే అయినా.. డైరెక్టర్ వెంకీ అట్లూరి రాసుకున్న విధానం, ప్రజెంట్ చేసిన తీరు చూస్తే అభినందించకుండా ఉండలేం. ప్రేమ కథల్లో కొత్తదనాన్ని ఎక్స్ పెక్ట్ చేయలేం. ఎందుకంటే అందరి జీవితాల్లో జరిగేదే. ఇక్కడ ఆదిత్య, వర్ష మధ్య జరిగిన ప్రేమకథ కూడా అలాంటిదే. ప్రేమికుల మధ్య జరిగే చిన్న చిన్న ఇగోలు, జ్ఞాపకాలు, సరదాలను దర్శకుడు ఎంతో అందంగా చెప్పాడు. స్లోగా మొదలైన ‘‘తొలిప్రేమ’’ హీరో హీరోయిన్లు కాలేజ్ లో చేరిన తర్వాత ఇంట్రస్ట్ కలుగుతుంది. కాలేజ్ ఎపిసోడ్ మొత్తం బాగుంది. ఇంటర్వెల్ అయ్యే సరికే సినిమాపై ఫీల్ గుడ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత జరుగబోయేది ఎంటో తెలిసినా.. అప్పటికే ఆదిత్య, వర్ష ప్రేమకథకు కనెక్టవడంతో ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో కథ స్లోగా సాగినా.. డైలాగులతో నిలబెట్టాడు డైరెక్టర్. దర్శకుడు వెంకీ అట్లూరిపై.. మణిరత్నం, ఇంతియాజ్ అలీ, శేఖర్ కమ్ముల ప్రభావం ఉన్నట్టు కన్పిస్తుంది. ఓవరాల్ గా ‘‘తొలిప్రేమ’’ అందరికీ కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్ ఈ స్టోరితో రిలేట్ అవుతారు. వాలెంటైన్స్ వీక్ కలిసొస్తుంది కాబట్టి.. కలెక్షన్స్ బాగా ఉండొచ్చు..

బాటమ్ లైన్: ఫీల్ గుడ్ లవ్ స్టోరీ

 

Posted in Uncategorized

Latest Updates