రివ్యూ : దేవదాస్

రివ్యూ : దేవదాస్
రన్ టైమ్: 2 గంటల 30 నిమిషాలు
నటీనటులు: నాగార్జున,నాని,రష్మిక,ఆకాంక్ష సింగ్,నవీన్ చంద్ర,కునాల్ కపూర్, శరత్ కుమార్,మురళీ శర్మ,నరేష్,బాహుబలి ప్రభాకర్,రావు రమేష్,శ్రీనివాస్ అవసరాల,వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్
మ్యూజిక్ : మణిశర్మ
నిర్మాత: అశ్వినీ దత్
రచన,దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 27,2018

స్టోరీ

అనాథ అయిన దేవా (నాగార్జున) ను చేరదీస్తాడు డాన్ (శరత్ కుమర్) ప్రపంచానికి తన మొహం తెలియకుండా దేవా ఓ డాన్ గా ఎదుగుతాడు. అయితే.. మరో డాన్ డేవిడ్ (కునాల్ కపూర్) శరత్ కుమార్ ను చంపేస్తాడు.వాళ్ల నాన్న ను చంపిన వాళ్లమీద పగ తీర్చుకునే క్రమంలో దాస్ (నాని) అనే డాక్టర్ తో పరిచయం ఏర్పడుతుంది.. దేవా ను మార్చాలనే దాస్ ప్రయత్నం సక్సెస్ అయిందా..తన నాన్నను చంపిన వాళ్లమీద దేవా పగతీర్చుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.

నటీనటుల పర్ఫార్మెన్స్

నాగార్జున ఫుల్ ఎనర్జీగా నటించాడు. ఈ మధ్య కాలంలో తను స్టైలిష్ గా కనిపించన మూవీ ఇదే..ఇక నాని కూడా తనదైన శైలిలో ఫన్ క్రియేట్ చేశాడు. సెన్సిబుల్ డాక్టర్ పాత్రలో ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఎమోషన్ ను కూడా బాగా పండించాడు. ఈ ఇద్దరి హీరోల కెమిస్ట్రీ సినిమాకు చాలా ప్లస్ అయింది.. రష్మిక, ఆకాంక్ష గ్లామర్ కు మాత్రమే పరిమితమయ్యారు. విలన్ కునాల్ కపూర్ వీక్ అయిపోయాడు. శరత్ కుమార్ కు సరైన ఇంపార్టెన్స్ లేదు. నవీన్ చంద్ర ఓకే. వెన్నెల కిషోర్, రావురమేష్, నరేష్ లు తమకు అలవాటైన పాత్రల్లో రాణించారు.

టెక్నికల్ వర్క్:

శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయింది. తన పనితనం తో సినిమాను బ్యూటిఫుల్ గా, రిచ్ గా చూపించాడు. మణిశర్మ పాటల్లో ఒకట్రెండు మినహా చెప్పుకోదగ్గవేవి లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తన మార్కు చూపించాడు. ఎడిటింగ్ బాగుంది..సాహి సురేష్ ఆర్ట్ వర్క్ గ్రాండ్ గా ఉంది..శ్రీరామ్ ఆదిత్య రాసుకున్న కొన్ని ఎమోషనల్ డైలాగులు బాగా పేలాయి.

విశ్లేషణ:

‘‘దేవదాస్’’ ఓ రెగ్యులర్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్. ఇద్దరు హీరోలు కలిసి చేసే హంగామా సగటు కమర్షియల్ ప్రేక్షకుడికి పాసైపోతుంది. ఓ మంచి సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ మాత్రం ఇవ్వదు..కమర్షియల్ ఎంటర్ టైనర్ కాబట్టి సినిమా చూసినంత సేపు అలా వెళ్లిపోతుంది తప్ప కథ, కథనాలు చెక్ చేసుకుంటే.. ‘‘దేవదాస్’’ లో ఏమి కనిపించదు. ఈ విషయంలో మాత్రం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నే తప్పపట్టాలి. ఇద్దరు మంచి స్టార్ లను పెట్టుకుని, సింపుల్ లైన్ తో ఓ సాదాసీదా సినిమా తీసాడు కానీ.. మంచి కథనం రాసుకోవడంలో విఫలమయ్యాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఫ్లాట్ గా వెళుతుంది తప్ప.. వావ్ అనిపించే మూమెంట్ ఎక్కడా కనిపించదు. సీన్లల్లో బలం కొరవడింది. కామెడీ ఉంది కానీ పేలలేదు, ఎమోషన్ ఉంది కానీ టచ్ అవ్వలేదు. రొమాన్స్ ఉంది కానీ ఫీల్ లేదు. సో ఇలా ప్రతీది చప్పగా సాగిపోతుంది..ఇలాంటి కథ,కథనాలకు నాగ్,నాని లిద్దరు ప్రధాన బలమయ్యారు. తమ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ లతో అలరించి ఆడియన్స్ ను మాగ్జిమమ్ ఎంటర్ టైన్ చేశారు. టైమ్ పాస్ కోసం అయితే ఓకే కానీ, ఓ మంచి సినిమా చూద్దామని వెళితే ఈ ‘‘దేవదాస్’’ లు నిరాశపరుస్తారు.

బాటమ్ లైన్:  టైమ్ పాస్ ‘‘దేవదాస్’’

Latest Updates