రివ్యూ : పంతం

Pantham-movie-review

రన్ టైమ్: 2 గంటల 25 నిమిషాలు

నటీనటులు: గోపిచంద్, మెహరీన్, శ్రీనివాస రెడ్డి, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి, షియాజీ షిండే, పవిత్రా లోకేష్, రాళ్లపల్లి, సంపత్ రాజ్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు

మ్యూజిక్: గోపి సుందర్

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ల

నిర్మాత: కె.కె రాధామోహన్

రచన,దర్శకత్వం: కె. చక్రవర్తి

రిలీజ్ డేట్: జూలై 5,2018

 కథేంటి?

మంత్రుల నుంచి వరసగా పెద్ద మొత్తంలో డబ్బును దొంగలిస్తుంటాడు హీరో గోపిచంద్. అనుమానం వచ్చిన హోమ్ మినిస్టర్ నాయక్ (సంపత్ రాజ్) ఎంక్వైరీ వేయిస్తాడు. ఆ ఎంక్వైరీలో హోమ్ మినిస్టర్ విక్రాంత్ అనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకుని షాక్ అవుతాడు. అసలు విక్రాంత్ ఇంత డబ్బు ఎందుకు దొంగలిస్తున్నాడు.. అతనెవరు? అనేది సస్పెన్స్

నటీనటుల పర్ఫార్మెన్స్:

గోపిచంద్ స్టైలిష్ గా కనపించాడు. తన క్యారెక్టర్ కు 100 శాతం న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ లో, క్లైమాక్స్ లో డైలాగులు చెప్పడంలో పవర్ ఫుల్ గా కనిపించాడు. మెహరీన్ ఎప్పటిలాగే బొద్దుగా ఉంది. నటనలో ఇంకా మెరుగవ్వాలి తను. శ్రీనివాసరెడ్డి, పృథ్వి, ప్రభాస్ శీను కాస్త కామెడీకి పనికొచ్చారు. సంపత్ రాజ్, ముఖేష్ రుషి, అషిశ్ విద్యార్థి, పవిత్రా లోకేష్ తమకు అలవాటైన పాత్రల్లో రాణించారు.

టెక్నీషియన్స్ వర్క్

ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ కి కావాల్సిన గ్రాండ్ లుక్ ఇచ్చాడు సినిమాటోగ్రాఫర్. గోపి సుందర్ నిరాశపరిచాడు. పాటల్లో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిర్మాత ఎక్కడ రాజీ పడకుండా భారీగా ఖర్చుపెట్టారు. డైరెక్టర్ చక్రి రాసుకున్న కొన్ని డైలాగులు బాగున్నాయి.

 విశ్లేషణ:

‘పంతం’ రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్. అవినీతిపై ఫైట్ చేసి సమాజానికి ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి సినిమాలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. తీసుకున్న పాయింట్ ఎఫెక్టివ్ గా లేకపోవడం, స్క్రీన్ ప్లే సమస్యలు ఉండటం వల్ల సినిమా ఒకింత నిరాశపరుస్తుంది. కొత్త డైరెక్టర్ చక్రవర్తి తన మొదటి సినిమాతోనే చాలెంజింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. ‘పెద్దొన్ని కొట్టి పేదోడికి పంచు’ అనే రాబిన్ హుడ్ సిద్దాంతానికి కమర్షియల్ టచ్ ఇవ్వాలనుకున్నాడు. ఇలాంటి సబ్జెక్ట్ లల్లో సిద్దహస్తులైన శంకర్, మురుగదాస్, కొరటాల లాంటి వాళ్లు డీల్ చేసినట్టు మాత్రం చేయలేకపోయాడు. సినిమా మొదలైన పట్టి నుంచి నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్ వరకు ఏ ఒక్క సీన్ లో ఆడియన్స్ కు ‘అక్కడ అన్యాయం జరుగుతుంది.. అనే ఫీల్ కలుగదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అయితే హీరో రియలైజ్ అయ్యే సీన్లు కూడా సరిగా పండలేదు. దానివల్ల బోర్ గా సాగుతుంది. చక్రి స్క్రీన్ ప్లే, డైరెక్షనే దానికి కారణం. కాకపోతే ఊహించిన ముగింపే అయినా క్లైమాక్స్ లో మాత్రం కాస్త ఫర్వాలేదనిపించాడు. కోర్టు రూమ్ సీన్లు బాగా పండాయి. గోపిచంద్ చెప్పిన డైలాగులు, లాయర్ అశిష్ విద్యార్థి సీన్ మెప్పిస్తుంది. అయితే అంతకు ముందు జరిగిన డామేజ్ వల్ల సినిమాపై హోప్స్ పోతాయి. బి.సి సెంటర్ ప్రేక్షకుల వరకు ఈ ‘పంతం’ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ గా పనికొచ్చినా.. ఓవరాల్ గా మాత్రం మెప్పించలేకపోయింది.

బాటమ్ లైన్ : ‘పంతం’ నెగ్గించుకోలేకపోయాడు.

Posted in Uncategorized

Latest Updates