రివ్యూ: పడి పడి లేచె మనసు

రివ్యూ: పడి పడి లేచె మనసు
రన్ టైమ్: 2 గంటల 40 నిమిషాలు
నటీనటులు: శర్వానంద్,సాయి పల్లవి,మురళీ శర్మ,సునీల్,ప్రియదర్శి,వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జె.కె
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన,దర్శకత్వం: హను రాఘవపూడి
రిలీజ్ డేట్: డిసెంబర్ 21,2018

స్టోరీ..

సూర్య (శర్వానంద్) కోల్ కతా లో ఉంటాడు. మొదటి చూపులోనే వైశాలి (సాయి పల్లవి)ని చూసి ప్రేమిస్తాడు. మొదట్లో నచ్చకపోయినా ..సూర్య చేసే అల్లరికి ఫిదా అయి ప్రేమలో పడుతుంది.  సూర్యకు మాత్రం పెళ్లి మీద నమ్మకం లేదంటాడు. దానికి వైశాలి నిరాకరిస్తుంది. సంవత్సరం తర్వాత నేను లేకుండా ఉండలేనని అనిపిస్తే..అప్పడు పెళ్లిచేసుకుందాం. అని యూరప్ వెళ్లిపోతుంది. సరిగ్గా ఏడాది గడిచాక వైశాలిని పెళ్లి చేసుకోవాలనిపించి, అక్కడికి వెళ్తాడు.  అక్కడ ఓ సంఘటన జరుగుతుంది. దాని వల్ల వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. చివరకు కలుసుకున్నారా లేదా అనేది స్టోరీ.

నటీనటుల పర్ఫార్మెన్స్..

శర్వానంద్ డీసెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లవర్ బాయ్ పాత్రలో తన గెటప్ కొత్తగా ఉంది. సాయి పల్లవి ఎప్పటిలాగే రాణించింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. మురళీ శర్మ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. సంపత్ కుమార్ చేసిన రోల్ కు సరైన జస్టిఫికేషన్ లేదు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ చేసిన కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. సెకండాఫ్ లో సునీల్ కామెడీ బోర్ కొట్టిస్తుంది.

టెక్నికల్ వర్క్..

జె.కె సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ గా ఉంది. కోల్ కతా అందాలను బాగా క్యాప్చర్ చేశాడు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ సూపర్బ్. అన్నీ పాటలు బాగున్నాయి. వాటికి కృష్ణకాంత్ అర్థవంతమైన సాహిత్యం తోడైంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని లవ్ ఫీల్ ను క్యారీ చేసింది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ లో కత్తెర పడాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. నిర్మాతలు పెట్టిన డబ్బు తెరపై కనిపిస్తుంది. హను రాఘవపూడి రాసుకున్న డైలాగులు బాగున్నాయి.

విశ్లేషణ..
‘‘పడి పడి లేచె మనసు’’ యావరేజ్ లవ్ స్టోరి..ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సింపుల్ కథ. దానికి ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కూడా కొత్తదేమి కాదు. ఈ మధ్య వచ్చిన ఓ సినిమాలో ఆ పాయింట్ టచ్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ కాస్త ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేశాడు. ఫస్టాఫ్ సాగతీతగా ఉన్నా..లీడ్ పెయిర్ మధ్య వచ్చే సన్నివేశాలు, కామెడీతో పాసైపోతుంది.  సెకండాఫ్ మొదలయ్యాక అసలైన పరీక్ష స్టార్టవుతుంది. ప్రామిసింగ్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్న హను..ఈ సినిమాతో నిరాశపరిచాడనే చెప్పాలి. మంచి లీడ్ పెయిర్, టెక్నికల్ సపోర్ట్ ఉన్నా..స్క్రీన్ ప్లే విషయంలో గాడి తప్పాడు. సెకండాఫ్ లో ఎంగేజ్ అయ్యే సీన్లు లేవు.  సినిమా ప్రేక్షుకుల సహనాన్ని పరీక్షిస్తుంది. క్లైమాక్స్ అబ్రప్ట్ గా ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

బాటమ్ లైన్-రోటీన్ లవ్ స్టోరీ

Latest Updates