రివ్యూ : మెర్కురి

merరన్ టైమ్ : 1 గంట 45 నిమిషాలు

నటీనటులు : ప్రభుదేవా, సనంత్, హిందూజ తదితరులు

సినిమాటోగ్రఫీ : తిరు

మ్యూజిక్ : సంతోష్ నారాయణ

నిర్మాణం : స్టోన్ బెంచ్ ఫిలింస్,పెన్ మూవీస్

తెలుగు రిలీజ్ : కె.ఎఫ్.సి ఎంటర్ టైన్మెంట్స్

రచన,దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్.

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 13, 2018

ఇంట్రో :

‘పిజ్జా’’, ‘జిగర్తాండ,‘ఇరైవి’’ లాంటి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మరో డిఫరెంట్ ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘మెర్కురి’ అనే మూకీ సినిమాను ప్రభుదేవా తో తీసాడు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ తో ఇంట్రస్ట్ కలిగించింది. మరి ‘పుష్ఫక విమానం’ వచ్చిన 30 ఏళ్ల తర్వాత వస్తున్న మరో మూకీ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షిద్దాం.

కథేంటి :

అన్ని హార్రర్ థ్రిల్లర్ మూవీ లాగే ఈ సినిమా కథ కూడా అలాగే మొదలవుతుంది. ఐదుగురు మూగ స్నేహితులు కలిసి ఓ ప్రదేశంలో పార్టీ చేసుకుంటారు. అందులో ఒకతను అమ్మాయిని ఇష్టపడి రాత్రి బయటకు తీసుకెళ్తాడు. వాళ్లకు తెలియకుండా కార్ లో వాళ్ల ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. వచ్చే దారిలో ప్రభుదేవాను యాక్సిడెంట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ప్రభుదేవా ఎవరు..? అతను చనిపోయాడా లేదా అనేది సస్పెన్స్.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

ఇప్పటివరకు డాన్సర్, డైరెక్టర్, కామెడీ హీరోగా మెప్పించిన ప్రభుదేవా ఈ చిత్రంతో సీరియస్ నటుడిగా అధ్బుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు. భయపెట్టే పాత్రలో, మాటలు రాని క్యారెక్టర్ లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ పండించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆహార్యం అన్ని సూట్ అయ్యాయి. మిగతా ఆర్టిస్టులంతా పెద్దగా మనకు తెలియనివాళ్లే. కానీ బాగా చేశారు. హీరోయిన్ రమ్యా నంబీశిన్ ఓ పాత్రలో తళుక్కున మెరిసింది.

టెక్నికల్ వర్క్ :

టెక్నికల్ గా ఈ సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంది. సైలెంట్ మూవీ కాబట్టి దానికి సంబంధించిన సౌండ్ డిజైన్, సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ గా ఉంది. తిర్రు సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.  నైట్ లొకేషన్స్, ఆ అట్మాస్పియర్ అద్బుతంగా ఉంది. ఆర్ట్ వర్క్ అయితే హాలీవుడ్ స్థాయిలో ఉంది. కార్తీక్ టెక్నకల్ టీమ్ నుంచి గ్రేట్ ఔట్ పుట్ తీసుకున్నాడు.

విశ్లేషణ:

‘మెర్కురి’ ఇంటెన్సీ ఉన్న సైలెంట్ థ్రిల్లర్. కార్తీక్ సుబ్బరాజ్ మరోసారి డిఫరెంట్ మూవీని ప్రేక్షకులకు అందించాడు. మాటల్లేకుండానే చెప్పాలనుకున్న పాయింట్ ను క్లారిటీగా చెప్పాడు. కొన్నిసార్లు ఆర్టిస్టులు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థంకాదు. సబ్ టైటిల్స్ ఉంటే బాగా కన్వే అయ్యేది. రెగ్యులర్ రివేంజ్ థ్రిల్లరే అయినా.. డైరెక్టర్ కార్తీక్ తనదైన శైలిలో ప్రజెంట్ చేసి అబ్బురపరిచాడు. ఫస్టాఫ్ లో ఒకట్రెండు సీన్లు తప్ప పెద్దగా మెరుపుల్లేని ‘మెర్కురి’ లో ఇంటర్వెల్ తర్వాత ఊపందుకుంటుంది. ప్రభుదేవా, యూత్ గ్యాంగ్ మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇక్కడ కార్తీక్ సుబ్బరాజ్ బ్రిలియన్సీ కనిపిస్తుంది. కొంత వరకే ఈ వేగం కనిపిస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్ గా డీల్ చేయడంతో కాస్త నెమ్మదిస్తుంది. సినిమా తక్కువ నిడివే అయినా.. ఫస్టాఫ్ లో కొన్ని సీన్ల వల్ల బోర్ కొడుతుంది. ఓవరాల్ గా ఇదో డిఫరెంట్ సినిమా. ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు దర్శక, నిర్మాతలను అభినందించాల్సిందే. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కు ‘మెర్కురి’ మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందింస్తుంది.

బాటమ్ లైన్: మాటల్లేకుండానే మాయ చేశాడు

Posted in Uncategorized

Latest Updates