రివ్యూ : రంగస్థలం

Rangastalam-reviewనటీనటులు : రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు,ప్ర కాష్ రాజ్, అనసూయ, అజయ్ ఘోష్, మహేష్, నరేష్, బ్రహ్మాజీ, శత్రు తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : రత్నవేలు

ఎడిటర్ : నవీన్ నూలి

ఆర్ట్ : రామకృష్ణ

నిర్మాతలు : మైత్రీ మూవీ మేకర్స్

రచన ,దర్శకత్వం: సుకుమార్

రిలీజ్ డేట్: మార్చి 30, 2018

కథేంటి:

1980లో రంగస్థలం అనే పల్లెటూల్లో అంతా ప్రెసిడెంట్ (జగపతి బాబు) చెప్పినట్టే జరగాలి. ఆయన కనుసన్నల్లో ఊళ్లో అక్రమాలు జరుగుతుంటాయి. ఆయనకు భయపడి పోటీ చేయడానికి ఎవరూ ధైర్యం చేయరు. పోటీ చేస్తే చంపేస్తాడు. ఆయన అరాచకాలు తట్టుకోలేక చివరకు చిట్టిబాబు (రామ్ చరణ్) వాళ్ల అన్నయ్య కుమార్ బాబు (ఆది పినిశెట్టి) ధైర్యం చేసి ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేస్తాడు. చిట్టిబాబు కూడా గట్టిగా సపోర్ట్ చేస్తాడు. మరి కుమార్ బాబును కూడా ప్రెసిడెంట్ ఏమైనా చేశాడా.. చిట్టిబాబు వాళ్ల అన్నయ్యను కాపాడుకున్నాడా లేదా అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

ఈ సినిమా గొప్పతనం ఏంటంటే మనకన్నీ పాత్రలే కనిపిస్తాయి. ఆర్టిస్టులు కనిపించరు. సరికొత్త రామ్ చరణ్ ను చూస్తారు ప్రేక్షకులు. తన కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనటంలో సందేహం లేదు. చిట్టిబాబు పాత్రలో జీవించేశాడు. ఆ యాస, మేకోవర్, ఎక్స్ ప్రెషన్స్, కామెడీ టైమింగ్ సూపర్బ్. రామలక్ష్మీ పాత్రలో సమంత ఒదిగిపోయింది. పల్లెటూరి అమ్మాయిగా అద్బుతంగా నటించింది. రంగమ్మత్త అనే మాస్ పాత్రలో అనసూయ మెప్పించింది. తనలో మంచి నటి ఉందని గుర్తు చేసింది. ప్రెసిడెంట్ పాత్రను జగపతిబాబు తప్ప ఇంకెవరూ చేయలేరన్నంత బాగా చేశాడు. ప్రకాష్ రాజ్ పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. ఆది పినిశెట్టి లుక్స్, పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. మిగతా ఆర్టిస్ట్స్ అజయ్ ఘోష్, మహేష్, సత్య, బ్రహ్మాజీ, శేషు అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నికల్ వర్క్ :

1980 బ్యాక్ డ్రాప్ మూవీకి తగ్గట్టు టెక్నికల్ టీమ్ నుంచి మంచి ఔట్ పుట్ లభించింది. ముందుగా అప్రిషియేట్ చేయాల్సింది ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణని. తన ఆర్ట్ వర్క్ తో ప్రేక్షకులను 38 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన విధానం అద్బుతం. సుకుమార్ డిటెయిలింగ్ గా ప్రెజెంట్ చేసిన విధానానికి హాట్సాఫ్. సినిమాటోగ్రఫీ మరో ప్రధానాకార్షణ. రత్నవేలు తన కెమెరాలో గోదావరి అందాలు, పాతకాలం మూడ్ ను బాగా చూపించాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం మరో హైలెట్. పాటలన్నీ బాగున్నాయి. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.

విశ్లేషణ:

‘రంగస్థలం’ ఈ మధ్య వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తాం. నవ్వుతాం, ఏడుస్తాం, ఎమోషనల్ అవుతాం. టోటల్ గా మూడు గంటలు రంగస్థలం అనే ఊరి కథతో, ఆ పాత్రలతో కనెక్ట్ అవుతాం. ఈ సినిమాతో సుకుమార్ తాను ఎందుకు డిఫరెంటో మరోసారి నిరూపించాడు. ఎక్కడా లోపాలు లేకుండా రాసుకున్నాడు. దాన్ని తెరపై చూపించాడు. ఎంచుకున్న కథకు దగ్గట్టు అప్పటి భూస్వామి వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ, సామాజిక పరిస్థితులను చక్కగా వివరించాడు. డైలాగులు కూడా చాలా బాగున్నాయి.

ప్రతి పాత్ర స్ట్రాంగ్ గా ఉంది. చిట్టిబాబు, రామలక్ష్మీ లవ్ ట్రాక్ ఫన్ గా ఉంది. చిట్టిబాబు వినికిడి సమస్య ఫస్టాఫ్ లో కామెడీకి పనికొచ్చింది. అంతా బాగున్న ఈ సినిమాలో లెంగ్త్ ఒకటే కాస్త ఇబ్బంది పెడుతుంది. సెకండాఫ్ లో కాస్త డ్రాగ్ అయిన ఫీల్ కలుగుతుంది. మళ్లీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో సుకుమార్ తన మార్కు చూపించడంతో సినిమాకు పర్ఫెక్ట్ ఎండింగ్ కుదిరింది. క్లాస్, మాస్ తో సంబంధం లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది.

బాటమ్ లైన్: రంగస్థలంలో అన్నీ సక్సెస్ పుల్ పాత్రలే

Posted in Uncategorized

Latest Updates