రివ్యూ: రెడ్

రివ్యూ: రెడ్
రన్ టైమ్: 2 గంటల 15 నిమిషాలు
నటీనటులు: రామ్,మాళవిక శర్మ,నివేత పేతురాజ్,అమృత ,సంపత్ రాజ్,పోసాని,సత్య,పవిత్ర లోకేష్,సోనియా అగర్వాల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ
మ్యూజిక్ :మణిశర్మ
నిర్మాత : స్రవంతి రవికిషోర్
రచన,దర్శకత్వం: కిషోర్ తిరుమల
రిలీజ్ డేట్ :జనవరి 14,2021

కథేంటి?

సిద్దార్థ్ ,ఆదిత్య (రామ్) ఇద్దరూ ఒకేలా ఉండే కవల పిల్లలు. ఇద్దరి జీవితాలు వేరువేరుగా సాగుతుంటాయి.కానీ ఇద్దరిలో ఒకరు ఓ మర్డర్ చేస్తారు.ఇద్దరినీ జైల్లో వేస్తారు.ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారుతుంది.ఏ క్లూ దొరకదు.ఇంతకీ ఇద్దరిలో ఆ మర్డర్ ఎవరు చేస్తారు.ఎందుకు చేశారు.అనేది సస్పెన్స్.చివరికి పోలీసులకు తెలిసిన నిజం ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్:

రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు.డ్యూయల్ రోల్ చేస్తూ సరైన ఎమోషన్స్ పండించాడు.మాళవిక శర్మ అందాలు ఆరబోసింది కానీ యాక్టింగ్ నిల్.పోలీసాపీసర్ పాత్రలో నివేత పేతురాజ్ ఆకట్టుకంటుంది.అమృత ఫర్వాలేదనిపించింది. పవిత్ర లోకేష్ రోల్ కొత్తగా ఉంది. సత్య,వెన్నెల కిషోర్ లు నవ్వించే ప్రయత్నం చేశారు. సంపత్ రాజ్, పోసాని తదితరులు తమకు అలవాటైన పాత్రలో రాణించారు.

టెక్నికల్ వర్క్:

మణిశర్మ పాటల్లో రెండు వినసొంపుగా ఉన్నాయి.ఎప్పటిలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను లేపాడు.సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.ఎడిటింగ్ బాగుంది.ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి.డైలాగులు కొన్ని బాగా రాసుకున్నాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల.

విశ్లేషణ:

‘‘రెడ్’’ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.తమిళ్ సినిమా ‘‘తడమ్’’ రీమేక్.అక్కడ యంగ్ హీరో కాబట్టి ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా హిట్ అయింది.కానీ ఇక్కడ రామ్ నోటెడ్ హీరో,సూపర్ హిట్ ‘‘ఇస్మార్ట్ శంకర్’’ తర్వాత రిలీజవుతున్న మూవీ.కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ బాగా ఉన్నాయి.అందుకే తెలుగులో కొన్ని మాస్ సీన్లు,ఐటమ్ సాంగ్ యాడ్ చేశారు.అందువల్ల కమర్షియాలిటీని,కంటెంట్ ను రెండిటినీ బ్యాలన్స్ చేయలేకపోయాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల.అందుకే మూవీ చూస్తున్నంత సేపు పెద్దగా కనెక్ట్ అవ్వరు ఆడియన్స్. కాస్టింగ్ ఇంకా బాగా ఉండాల్సింది.రామ్ తప్ప ఎవ్వరూ సరిగా న్యాయం చేయలేకపోయారు.లాజిక్ లు కొన్ని మిస్ చేస్తూ..తమకు అనుగుణంగా రాసుకున్నట్టు అనిపిస్తుంది.సెకండాఫ్ హీరోల ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషన్ ను అంతగా చూపించాల్సిన అవసరం లేదు.ఫస్టాఫ్ లో అసలు కథ మొదలయ్యే వరకు సాగదీసి నట్టు అనపిస్తుంటుంది.బోరింగ్ గా అనిపిస్తుంది.సెకండాఫ్ స్టార్టింగ్ ఓకే అనిపించినా..చివరికి వచ్చే సరికి విసుగుపుడుతుంది.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే దీనికి కారణం.ఏదేమైన ‘‘రెడ్’’ అనుకన్నంతగా ఆకట్టుకోలేకపోయింది.ఎక్సిక్యూషన్ ఇంకా బలంగా ఉండినట్టయితే ‘‘దృవ’’ లాంటి మంచి కమర్షియల్ హిట్ అయ్యేది.

బాటమ్ లైన్: ఆకట్టుకోని థ్రిల్లర్

Latest Updates