రివ్యూ : వైఫ్ ఆఫ్ రామ్

రివ్యూ: వైఫ్ ఆఫ్ రామ్
న్ టైమ్: 2 గంటలు
నటీనటులు: లక్ష్మీ మంచు,సామ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: భాస్కర్
మ్యూజిక్: రఘు దీక్షిత్
ఎడిటర్ : తమ్మిరాజు
మాటలు: సందీప్ గంటా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ యెలకంటి
రిలీజ్ డేట్: జూలై 20, 2018

మంచు లక్ష్మి లీడ్ రోల్ లో నటించి వైఫ్ ఆఫ్ రామ్ శుక్రవారం (జూలై-20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు స్ర్కీన్ పై అరుదుగా కనిపించే క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ జానర్‌ లో తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్‌ ఎలకంటి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. టీజర్‌, ట్రైలర్‌ తోనే ఇంట్రస్ట్ క్రియేట్‌ చేసిన W/O రామ్‌ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం..

కథేంటి?

దీక్ష (లక్ష్మీ మంచు) NGOలో పనిచేస్తూ ఉంటుంది. రామ్ (సామ్రాట్)ను పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవనం సాగిస్తుంటుంది. ఓ రోజు తన భర్త మిస్సింగ్ అని పోలీసులను ఆశ్రయిస్తుంది. తన భర్తను ఎవరో చంపేశారని చెప్తుంది. తన భర్త జాడ కోసం అంతటా తిరుగుతుంది. భర్త ఏమయ్యాడు. దొరికాడా లేదా.. అతని అన్వేషణలో దీక్ష తెలుసుకున్న నిజాలు ఏంటి అనేది సస్పెన్స్.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

లక్ష్మీ మంచు ఇందులో పరిణితి చెందిన నటనతో మరోసారి మెప్పించింది. భర్త ఆచూకీ కోసం తపన పడే దీక్ష పాత్రలో మంచి నటన కనబరిచింది. సామ్రాట్ ఫర్వాలేదనిపించాడు. పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్రలో ప్రియదర్శి బాగా చేశాడు. మరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ రాణించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఆదర్శ్ బాలకృష్ణ మెప్పించాడు.

టెక్నికల్ వర్క్:

భాస్కర్ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. పాటలు లేని ఈ సినిమాలో రఘు దీక్షిత్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కట్టిపడేసాడు. ఇలాంటి థ్రిల్లర్ జానర్ కు కీలకమైన రీ రికార్డింగ్ విషయంలో రఘు మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూయ్స్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. సందీప్ రాసిన సంభాషణలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
మంచు లక్ష్మీ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్‌ పాయింట్స్‌ :

స్లో నెరేష‌న్‌
క‌హాని సినిమాను  గుర్తుచేయ‌డం
కామెడీ లేక‌పోవ‌డం

విశ్లేష‌ణ‌

రోగాన్ని నయం చేసుకోవ‌డానికి ప్ర‌తీసారీ వైద్యుడి ద‌గ్గ‌ర‌కే వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. ఒక్కోసారి సొంత వైద్యం కూడా చేసుకోవాలి.. – ఈ కాన్సెప్ట్ తో సాగే క‌థ ఇది. ఈ క‌థ‌ని మొద‌లెట్టిన ప‌ద్ధ‌తి, సాగిన తీరు చూస్తే క‌హాని గుర్తొస్తుంది . ఈ టైప్ సస్పెన్స్ డ్రామా, మర్డర్ మిస్టరీల జానర్ సినిమాలకు ఒక వర్గం ఆడియన్స్  ఎప్పుడు ఉంటారు. అయితే కథనాన్ని ఆకట్టుకునేల చేప్తే కట్టి పడేస్తాయి. ఈ మూవీని అంతే గ్రిప్పింగ్ గా నెరేట్ చేసాడు దర్శకుడు విజయ్ యెలకంటి. అయితే ఫస్ట్ ఆఫ్ ఒకే అనిపించి..సెకండఫ్ కు వచ్చే సరికి మాత్రం స్టోరీలోకి లీనం అవుతాం. ఇక ప్రి క్లైమాక్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన కథ..క్లైమాక్స్  ట్విస్ట్ తో, ముగింపుతో ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

Latest Updates