రివ్యూ: సమ్మోహనం

sammohanam

రన్ టైమ్: 2 గంటల 24నిమిషాలు
నటీనటులు : సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరీ, నరేష్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి, నందు, రాహుల్ రామకృష్ణ, హర్షిణి, అభయ్, కాదంబరి కిరణ్, హరితేజ తదితరులు
సినిమాటోగ్రఫీ : పి.జి విందా
మ్యూజిక్ : వివేక్ సాగర్
నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్
రచన, దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
రిలీజ్ డేట్ : జూన్ 15, 2018

స్టోరీ :

ఫైన్ ఆర్ట్స్ చదివిన విజయ్ (సుధీర్ బాబు)కు సినిమాలన్నా.. మూవీ ఇండస్ట్రీ అన్నా నెగిటివ్ థింక్ ఉంటుంది. వాళ్ల నాన్నకేమో సినిమా అంటే పిచ్చి. ఆయన బలవంతంపై ఓ సినిమా టీంకు వాళ్ల ఇంట్లో షూటింగ్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఈ సినిమా హీరోయిన్ సమీరా రాథోడ్ (అదితీ రావు హైదరి) క్లోజ్ గా మూవ్ అవ్వడంతో లవ్ లో పడతాడు. అయితే తనను రిజెక్ట్ చేస్తుంది సమీరా. ఎప్పుడూ ఎవరికీ ప్రపోజ్ చేయని విజయ్ కు సమీరా అలా చెప్పడంతో ఎలా రియాక్టయ్యాడు.. అంత క్లోజ్ అయిన సమీరా అతన్నీ రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది  సినిమాలో చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్

సుధీర్ బాబు నటనలో ఇంప్రూవ్ అయ్యాడు. మంచి వేరియేషన్ చూపిస్తూ నటుడిగా ఎదుగుతున్నాడు. ఇందులో సుధీర్ పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా, ఇంప్రెసివ్ గా ఉంది. హీరోయిన్ అదితీరావు అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. మంచి క్యారెక్టర్ దక్కింది. సీనియర్ యాక్టర్ నరేష్ హిలేరియస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. యాక్టింగ్ పిచ్చి ఉండే తండ్రి పాత్రలో బాగా నవ్వించి సినిమాకు ప్లస్ అయ్యాడు. కమెడియన్ రాహుల్ రామకృష్ణ, అభయ్  నవ్వించారు. హీరో తల్లి పాత్ర చేసిన పవిత్ర నటన బాగుంది. తల్లి, కొడుకు మధ్య జరిగే ఓ సీన్ లో ఆమె రాణించింది. తనికెళ్ల భరణి, హర్షిణి, హరితేజ మెప్పించారు.

టెక్నికల్ వర్క్

పి.జి.విందా సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఎక్కువ మార్కులు స్కోర్ చేశాడు. సిట్యూయేషనల్ సాంగ్స్ తో సినిమా మూడ్ బాగా క్యారీ చేశాడు. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూయ్స్ చక్కగా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. ఇంద్రగంటి రాసుకున్న సంభాషణలు బాగున్నాయి.

ప్లస్ లు

హీరో, హీరోయిన్లు

నరేష్ క్యారెక్టర్

సంగీతం

మైనస్ లు

స్లో పేస్

సెకండాఫ్

విశ్లేషణ :

సమ్మోహనం నిజంగానే సమ్మోహన పరుస్తుంది. ఈ మధ్య వచ్చిన ఓ మంచి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ మార్కు క్రియేట్ చేసుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి డీసెంట్ సినిమాను అందించాడు. ఇంట్రస్టింగ్ లవ్ పాయింట్ తో స్టోరీలోకి లీనం చేసి మేజర్ పార్ట్ వరకు ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా స్లోగా నడిపించి సహనాన్ని పరీక్షించాడు. ఫస్టాఫ్ వరకు ఫన్ గా సాగిపోయిన సమ్మోహనం.. సెకండాఫ్ లో బ్రేకులు పడ్డాయి. చిన్న పాయింట్ తో ఇంట్రస్ట్ కలిగించిన డైరెక్టర్ తర్వాత రెగ్యులర్ సెటప్ ఇచ్చి ఒకింత నిరాశపరిచాడు. అయినప్పటికీ.. సమ్మోహనం ఆకట్టుకుంటుంది. సినిమా హీరోయిన్ అంటే అందరూ అలాగే ఉండరు. వాళ్లకు ఎమోషన్స్ ఉంటాయి అనే పాయింట్ ను అంతర్లీనంగా చూపించిన పాయింట్ బాగుంది. సుధీర్ బాబు క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. హీరోయిన్.. హీరోను రిజెక్ట్ చేసినపుడు వాళ్ల అమ్మ మోటివేట్ చేసిన విధానం గమనిస్తే.. ఇంద్రగంటిలోని సెన్సిబుల్ రైటర్ కనిపిస్తాడు. అలాంటి మంచి సీన్లు చాలా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ వరకు పడుతూ, లేస్తూ సాగిన ఈ సినిమా క్లైమాక్స్ లో మళ్లీ ఫన్, ఎమోషన్స్ బాగా పండటంతో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. టైమ్ పాస్ ఎంటర్ టైన్మెంట్ కోసం సమ్మోహనం ఈ వీకెండ్ ఆప్షన్.

బాటమ్ లైన్: సమ్మోహన పరిచారు

Posted in Uncategorized

Latest Updates