రివ్యూ: హ్యాపీ వెడ్డింగ్

రన్ టైమ్: 2 గంటల 13 నిమిషాలు

నటీనటులు: సుమంత్ అశ్విన్, నిహారిక, నరేష్, మరళీ శర్మ, పవిత్రా లోకేష్, తులసి, రాజా, అన్నపూర్ణ, పూజిత పొన్నాడ తదితరులు

సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి

పాటలు: శక్తికాంత్ కార్తీక్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: తమన్

మాటలు: భవానీ ప్రసాద్

నిర్మాణం: పాకెటి సినిమా,యువీ క్రియేషన్స్

కథ,దర్శకత్వం: లక్ష్మణ్ కార్య

రిలీజ్ డేట్: జులై 28,2018

కథేంటి..?

హ్యాపీ వెడ్డింగ్ పాయింట్ తో ఈ మధ్య చాలా సినిమాలొచ్చాయి. అక్షర (నిహారిక),ఆనంద్ (సుమంత్ అశ్విన్) ప్రేమించుకుంటారు.పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకుంటారు.పెద్దలను కూడా ఒప్పిస్తారు. కానీ పెళ్లి దగ్గరపడుతుండగా ఆనంద్ తనను సరిగా పట్టించుకోవట్లేదని కంప్లయింట్ చేస్తుంది అక్షర.ఇదే కారణంతో పాత బాయ్ ఫ్రెండ్ విజయ్ (రాజా) ను కూడా వదిలేసిన అక్షరకు మళ్లీ ఆనంద్ మీద కూడా కన్ఫూజన్ ఏర్పడుతుంది.అదే టైమ్ లో విజయ్ మళ్లీ క్లోజ్ అవుతాడు.ఈ పరిస్థితుల్లో ఎవర్నీ సెలక్ట్ చేసుకుంటుంది అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

సుమంత్ అశ్విన్ నటనలో ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేదు.అవసరానికి మించి నటించి విసిగించాడు.నిహారిక కొన్ని సీన్లల్లో ఫర్వాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్లల్లో తేలిపోయింది. సుమంత్ ఓవర్ గా నటించేస్తుంటే,నిహారిక చలనం లేనట్టుగా నటించేసింది.ఈ జీవం లేని కథలో సీనియర్ ఆర్టిస్టులు నరేష్,మురళీ శర్మ కూడా మాములుగా మిగిలిపోయారు.అన్నపూర్ణ,పవిత్రాలోకేష్,తులసి లు రెగ్యులర్ క్యారెక్టర్స్ చేశారు.రాజా ఫర్వాలేదనిపించాడు. పూజిత పొన్నాడ కు చెప్పించిన తెలంగాణ డబ్బింగ్ ఎబ్బెట్టుగా ఉంది.

టెక్నికల్ వర్క్:

బాల్ రెడ్డి సినిమాటోగ్రపీ యావరేజ్ గా ఉంది. శక్తికాంత్ కార్తీక్ పాటలు సోసోగా ఉన్నాయి.తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు.ప్రొడక్షన్ వాల్యూయ్స్ ఓకే.ఎడిటింగ్ లో కొన్ని సీన్లకు కత్తెరపడాల్సింది. ఎప్పుడో పాతవైపోయిన ప్రాస డైలాగులతో రైటర్ భవానీ ప్రసాద్ ఇబ్బంది పెట్టాడు.

విశ్లేషణ:

‘‘హ్యాపీ వెడ్డింగ్ ’’ ఓ బోరింగ్ ఎంటర్ టైనర్. పెళ్లి విషయంలో ఎవర్ని చూజ్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ క్యారెక్టర్ లతో మనకు చాలానే సినిమాలొచ్చాయి. పాయింట్ పాతదే అయినా..ఫన్ గా చేబితే ఓ ఫీల్ గుడ్ సినిమా అయ్యే ఆస్కారముంటుంది. ఇందులో ఫన్ లేకపోగా లవ్,ఎమోషన్,కన్ఫూజన్..ఇలా ఎదీ కరెక్ట్ గా కుదరక ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుందీ సినిమా. షార్ట్ ఫిలింస్,వెబ్ సిరీస్ లకు సరిపోయే పాయింట్ తో ఫీచర్ సినిమా ఎలా తీయాలనుకున్నారో అర్థంకాదు. ఇంట్రస్టింగ్ సీన్లు రాసుకుని వుంటే కొంత వరకైనా ఉపయోగం ఉండేదేమో. కానీ కొత్త డైరెక్టర్ లక్ష్మణ్ కార్య ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయాడు. తను అనుకున్న పాయింట్ కు సరైన కాన్ ఫ్లిక్ట్ సెట్ చేసుకోలేదు.ముందు నుండి ఇదో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానే ప్రమోట్ చేసారు.కానీ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఫోకస్ చేయలేదు. దీంతో రాజా క్యారెక్టర్ తేలిపోయింది.ఇటు హీరోయిన్ కన్ఫూజన్ కు గురయ్యే పాయింట్ కూడా సరిగా లేదు.కేవలం తనను పికప్ చేసుకోవడానికి లేట్ గా వచ్చాడని హీరో మీద తన ఒపీనియన్ మార్చుకుంటుంది. ఇలా కన్సీన్సింగ్ గా లేని ప్లాట్ తో,ఎంగేజింగ్ గా లేని స్క్రీన్ ప్లే తో ‘‘హ్యాపీ వెడ్డింగ్’’ మొత్తంగా బోర్ కొట్టిస్తుంది. షార్ట్ ఫిలింకు ఎక్కువ ఫీచర్ ఫిలిం కు తక్కువ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే.

Latest Updates